శిరోజాల అందం కోసం మార్చుకోవాల్సిన అలవాట్లు.. తీసుకోవాల్సిన ఆహారాలు..

శిరోజాల అందానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నా సరే జుట్టు రాలిపోవడమో, చుండ్రుతో బాధపడటమో జరుగుతుంటుంది. జుట్టు సంరక్షణ గురించి ఆలోచించేవారు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, శిరోజాల ఆరోగ్యానికి జీవన శైలి కూడా కారణమే. మీరు తీసుకునే ఆహారం, జీవన విధానంలో మార్పులు కూడా జుట్టుని ప్రభావితం చేస్తాయి. అందుకోసం జీవనశైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. మీ జుట్టుకి ఏదైతే సరైనదో తెలుసుకుని అది తీసుకుంటే జుట్టుకి సంబంధించిన ఇబ్బందులు తలెత్తవు.

జుట్టు ఊడిపోతున్న సమస్యతో బాధపడుతున్నవారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు..

జుట్టుకి సంబంధించి ఏదైనా కనీసం ఆరు నెలలు లేదా సంవత్సరం పట్టే అవకాశం ఉంది. అందుకే వైద్యం తీసుకునేటపుడు ఈ విషయాలన్నింటినీ మైండ్ లో పెట్టుకోండి.

జింక్, విటమిన్ బీ12, విటమిన్ డి3 ఇంకా ఐరన్ ఉన్న పదార్థాలు తీసుకోవాలి. వీటి డోస్ అనేది మీ రక్తప్రసరణ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఇలాంటివి తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

ఆయుర్వేద మూలికలు, సుగంధ ద్రవ్యాలు

పసుపు, పూదీనా, ఉసిరి, జీలకర్ర, జాజికాయ, అల్లం మొదలైన వాటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటకి వెళ్ళిపోతాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోజువారి ఆహారంలో కూరగాయలని భాగం చేసుకోండి. రంగు రంగుల కూరగాయలు మీ కేశాల పటుత్వాన్ని పెంచడంలో సాయపడి జుట్టు సంరక్షణకి తోడ్పడుతాయి.

ప్రోటీన్ తీసుకోవడాన్ని పెంచాలి.

మాంసం, చేపలు, గుడ్లు, సోయాబీన్, గింజలు, సముద్రపు ఆహారంలో ప్రోటీన్ నిల్వలు ఎక్కువగా ఉంటాయి. కావాల్సినంత ప్రోటీన్ అందితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

ధ్యానం

ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. అనవసర ఒత్తిళ్ళు దూరమవుతాయి. అందువల్ల మనసు మీద భారం ఉండదు.