స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు తప్పక వీటి గురించి తెలుసుకోవాలి…!

-

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఎకౌంట్ వుందా..? అయితే ఈ విషయాలు మీకు తప్పక తెలియాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఎస్‌బీఐలో ఖాతా కలిగిన వారు బ్యాంక్ ఎలాంటి సర్వీసులు ఇస్తోందో ముందు గమనించాలి. అదే విధంగా స్టేట్ బ్యాంక్ ఎలాంటి వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోందో కూడా మీరు తెలుసుకోవాలి. స్టేట్ బ్యాంక్ టర్మ్ డిపాజిట్ల పై వడ్డీ రెట్లని ఆఫర్ చేస్తోంది.

మీరు 7 రోజుల నుంచి 10 ఏళ్ల మధ్య కాలం లో మీకు నచ్చిన టెన్యూర్‌ లో ఎఫ్‌డీ చేయొచ్చు. మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన మీకు వచ్చే రాబడి కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే 2.9 శాతం నుంచి 5.4 శాతం వరకు వడ్డీ పొందొచ్చు.

అదే ఒకవేళ సీనియర్ సిటిజన్స్‌కు అయితే 0.5 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై 2.9 శాతం వడ్డీ వస్తుంది. 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీలపై 3.9 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే 180 రోజుల నుంచి 210 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల పై అయితే 4.4 శాతం అదే 211 రోజుల నుంచి ఏడాది లోపు ఎఫ్‌డీల పై అయితే 4.4 శాతం వడ్డీ పొందొచ్చు.

మీరు కనుక ఏడాది నుంచి రెండేళ్ల లోపు ఎఫ్దీ చేస్తే… 5 శాతం వడ్డీ వస్తుంది. ఒకవేళ రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు ఎఫ్‌‌డీల పై 5.1 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు ఎఫ్‌డీలపై 5.3 శాతం వడ్డీ వస్తుంది. ఒకవేళ మీరు ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు ఎఫ్దీ చేస్తే అప్పుడు మీకు 5.4 శాతం వడ్డీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news