ఈ ఐదు తప్పుల వల్లే పెదాలు నల్లగా అయిపోతాయి..!

-

చాలామంది పెదవులు నల్లగా మారిపోతాయి. అయితే నల్లగా ఎందుకు మారిపోతున్నాయి అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే మనకి ఉండే ఈ ఐదు అలవాట్లు వల్ల పెదవులు నల్లగా అయిపోతాయి అని నిపుణులు అంటున్నారు.

అయితే వాటి కోసమే ఇప్పుడు మనం చూద్దాం. ముఖంలో అందంగా కనిపించేది నవ్వు. అందమైన నవ్వు ఉండాలి అంటే అందమైన పెదవులు కూడా ఉండాలి. అందుకనే లిప్ కేర్ చాలా ముఖ్యం. అసలు పెదవులు ఎందుకు నల్లగా అయిపోతాయి..?, దీనికి గల కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం.

హైడ్రేట్ గా లేకపోతే:

మనిషి యొక్క శరీరంలో 70 శాతం నీళ్లు ఉంటాయి. అయితే నీళ్లు కనుక లేనట్లయితే చర్మంలో మార్పు వస్తుంది. పెదవుల్లో కూడా నరిష్మెంట్ ఉండదు. దీని కారణంగా పెదవులు పొడిబారిపోతాయి మరియు పగుళ్లు వస్తాయి. అదేవిధంగా నల్లగా కూడా మారిపోతాయి. అందుకని హైడ్రేట్ గా ఉండడం చాలా ముఖ్యం. పెదవులు హైడ్రేట్ గా ఉండాలంటే లిప్ బామ్ వంటివి సమయానుసారం రాసుకోండి. అలానే కోకో మరియు షీ బటర్ కూడా బాగా పనిచేస్తుంది. తాజా పండ్లు, నీళ్ళు, జ్యూసులు కూడా ఎక్కువగా తీసుకోండి.

స్క్రబ్ చెయ్యకపోతే:

స్క్రబ్ చేయకపోవడం వల్ల కూడా నల్లగా మారిపోతాయి. తేనే మరియు పంచదార కలిపి పెదవులకి రాయండి. దీనితో డెడ్ స్కిన్ తొలగిపోయి పెదవులు క్లియర్ గా ఉంటాయి మరియు అందంగా ఉంటాయి.

స్మోకింగ్:

స్మోకింగ్ చేయడం వల్ల కూడా పెదవులు నల్లగా మారిపోతాయి. కాబట్టి స్మోకింగ్ కి దూరంగా ఉండండి.

పెదవులు పట్ల కేర్ తీసుకోకపోవడం:

సరైన కేర్ పెదవులు పట్ల తీసుకోక పోవడం వల్ల కూడా సమస్య వస్తుంది. దీనికోసం మీరు పెదవులపైన కొద్దిగా బాదం నూనె, కొబ్బరి నూనె, ఆలివ్ నూనె అప్లై చేయండి దీనితో కూడా పెదవులు అందంగా ఉంటాయి.

లిప్ బామ్:

సూర్యకిరణాల వల్ల కూడా పెదవులు నల్లగా అవుతాయి. కాబట్టి ఎస్ పి ఎఫ్ 30 తో కూడి ఉన్న లిప్ బామ్ ని కొనుగోలు చేసి వాడండి

Read more RELATED
Recommended to you

Latest news