భారత్‌ బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు..

అమరావతి : ఈ నెల 27 వ తేదీన రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కు టీడీపీ పార్టీ సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్‌ చీఫ్ అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే తెలుగు దేశం పార్టీ కి ప్రధానమని అచ్చెన్నాయుడు ప్రకటించారు. రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాల పై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్‌ చేశారు.

రైతు వ్యతిరేక చట్టాల విషయంలో కేంద్రం పునరా లోచన చేయాలని టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ చీఫ్ అచ్చెన్నాయుడు. రైతులను సీఎం జగన్ కూలీలుగా మార్చారని మండి పడ్డారు.

ఈ నెల 27 వ తేదీన రైతులు చేపట్టే… భారత్‌ బంద్‌ కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ నేతలు భారీ సంఖ్య లో పాల్గొనాలని స్పష్టం చేశారు. రైతులకు తెలుగు దేశం పార్టీ… ఎప్పటికి అండగానే ఉంటుందన్నారు అచ్చెన్నాయుడు. కాగా… కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన.. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 27 వ తేదీన భారత్‌ బంద్‌ కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.