కనుబొమలు ఒత్తుగా పెరగాలా? ఇంట్లో తయారు చేసుకునే ఈ ఆయిల్ ప్రయత్నించండి.

కన్నుల అందాన్ని కనుబొమలు మరింతగా పెంచుతాయి. దాంతో పూర్తి ముఖానికే కొత్త అందం వస్తుంది. అందుకే కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరేమో వాటికి పెన్సిల్ తో గీయడమో, లేదా కొని ఆయిల్స్ వాడడమో చేస్తుంటారు. ప్రస్తుతం మీ కనుబొమల అందాన్ని మరింత పెంచడానికి ఇంట్లో తయారు చేసుకోగలిగే ఆయిల్ గురించి తెలుసుకుందాం.

eyebrows

కనుబొమల కోసం ఆయిల్ వాడాలనే ప్రస్తావన వచ్చినపుడు కొబ్బరి నూనె మంచిది అంటారు. కొందరేమో ఆలివ్ ఆయిల్ ఐతే ఇంకా బాగుంటుంది అంటారు.

కేవలం ఒక్క ఆయిల్ మాత్రమే కాకుండా వివిధ రకాల ఆయిల్ మిశ్రమాలు మరింత బాగా పనిచేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

దీనికోసం కావాల్సిన పదార్థాలు

ఆలివ్ ఆయిల్- 2టేబుల్ స్పూన్లు
ఆముదం నూనె- 2టేబుల్ స్పూన్లు
కొబ్బరినూనె- 2టేబుల్ స్పూన్లు
బాదం నూనె- 2టేబుల్ స్పూన్లు

తయారీ పద్దతి

పైన చెప్పిన అన్ని నూనెలని ఒకే దగ్గర మిక్స్ చేయండి. ఈ నూనెల మిశ్రమం బాగా అయ్యాక ఒక జారి తీసుకుని నిల్వ చేసుకోండి.

వాడే విధానం

రోజూ ఒకసారి నూనెల మిశ్రమం తీసుకుని కనుబొమల మీద బాగా మసాజ్ చేయండి. ఇలా కనీసం నెలరోజుల పాటైనా చేయాలి. ఆ తర్వాత ఫలితం మీకే కనిపిస్తుంది. క్రమం తప్పకుండా నెలరోజులు కొనసాగిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

అందమైన కనుబొమలు మీ సొంతం కావడానికి ఇంట్లో తయారు చేసుకోగలిగే ఈ నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది.