బిజినెస్ ఐడియా: ఈ ఆకులను పెంచితే లక్షాధికారి అవ్వడం ఖాయం..

-

సొంతంగా బిజినెస్ చేయాలని అందరూ అనుకుంటారు అయితే ఎటువంటి బిజినెస్ ను చేస్తే మంచి లాభాలను పొందవచ్చు.. అని అనుకుంటారు. కొన్ని రకాల ఆకులు రైతులను లక్షాధికారి చేస్తాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..అనేక రకాల ఆకుల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ ఆకులు వేర్వేరు చోట్ల అవసరమవుతాయి. కొన్ని రకాల ఆకులు పూజలు, శుభకార్యాల్లో అవసరమైతే.. మరికొన్నింటిని ఆహారంలో వినియోగిస్తారు. అందులో ప్రధానమైనవి అరటి, తమలపాకు. ఈ రెండు కాకుండా.. మరో ఆకు కూడా ఉంది. అదే సాఖూ ఆకు. వీటికి కూడా మార్కెట్లో కూడా పెద్ద డిమాండ్ ఉంటుంది.

దక్షిణ భారతదేశంలో అరటి ఆకులకు డిమాండ్ చాలా ఎక్కువ. ఇది కాకుండా ఉత్తర, తూర్పు భారతదేశంలో తమలపాకులకు మంచి గిరాకీ ఉంది. మరోవైపు కొండ ప్రాంతాలలో అరటి ఆకుల మాదిరిగానే సాఖూ ఆకులను ఉపయోగిస్తారు. ఈ మూడు రకాల ఆకులను పండించడం ద్వారా రైతులకు బాగా ఆదాయం వస్తుంది. అరటి పండ్ల తో పాటు అరటి ఆకుల వల్ల కూడా మంచి లాభాలను పొందవచ్చు..ఆహారం వడ్డించడానికి ఉపయోగిస్తారు. కొన్ని హోటల్స్‌లో కూడా వీటిని వినియోగిస్తారు. అందువల్ల వీటికి డిమాండ్ బాగానే ఉంటుంది..

తమలపాకులు..తమలపాకులను మనదేశంలో దాదాపు ప్రతిచోటా ఉపయోగిస్తారు. ఉత్తర, తూర్పు భారతదేశంలో దీనికి డిమాండ్ గరిష్ట స్థాయిలో ఉంది. దక్షిణ భారతదేశంలో కూడా ఎక్కువగా వినియోగిస్తారు. పూజలు, శుభాకార్యాల్లో తమలపాకుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అన్నింటికీ మించి పాన్‌ షాప్‌లో తమలపాకులు ఉండాల్సిందే. పలు రకాల పాన్‌లలో వీటిని ఉపయోగిస్తారు..ఈ మధ్య వంటల లో కూడా తమలపాకులను ఉపయోగిస్తారు.

సాఖు ఆకులు.. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు. దీని ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. వీటిని కూడా అరటి ఆకుల్లానే వివాహాల్లో ఆహారం వడ్డించేందుకు, ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తారు. సాకు చెట్ల ఆకులే కాదు, కలప కూడా చాలా ఖరీదైనది.వీటితో కూడా మంచి ఆదాయాన్ని పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news