ఎవరూ స్టార్ట్‌ చేయని బిజినెస్‌ ఐడియా! ఇక మీకు లాభాల పంట

-

ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇది నిజం! ఈ కాలంలో ఉద్యోగాల కంటే సొంత వ్యాపారం చేసుకుంటేనే ఎంతో బావుటుంది అనిపిస్తుంది. అదేంటంటే కరోనా కాలం కాబట్టి అందరి దృష్టి శానిటేషన్‌ పడింది. ప్రధానం ఆస్పత్రులు, బ్యాంకులు, కాలేజీలు ఇలా జన సామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ శానిటేషన్‌ లిక్విడ్‌లు ఎంతగానో అవసరం. కరోనా నుంచి మనం తప్పకుండా పాటించాల్సిన నియమం శానిటైజేషన్‌ అవసరం. అయితే దీనికి ప్రస్తుతం చాలా డిమాండ్‌ ఉంది. కాబట్టి దీన్ని మనం అనుకూలంగా మార్చుకొని వ్యాపారం చేసుకోవచ్చు.


శానిటరీ కెమికల్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ చేయడంతో మీరు వ్యాపారం చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ముఖ్యంగా ఓ గోడౌన్, ట్రక్‌. ఇది మీరు ప్రారంభించే ముందు ఆస్పత్రులు, కాలేజీలు ఇతర సంస్థల నుంచి ఆర్డర్స్‌ తెచ్చుకోవాల్సి ఉంటుంది. వారికి కావాల్సిన బ్రాండ్లను తెలుసుకుని. అవసరమైన వస్తువులు తెచ్చుకోవాలి. హాస్పిటల్‌ క్లీనింగ్‌ కోసం వాడే కెమికల్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ స్టార్ట్‌ చేసుకుంటే మీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. హాస్పిటల్లు ఎల్లప్పుడూ డిసిన్ఫెక్టడ్‌ ఇతర శానిటైజేషన్‌ సామాగ్రి నిత్యం అవసరం ఉంటుంది. సాధారణంగా వారు హోల్‌ సేల్‌లో కొనుగోలు చేస్తుంటారు. అయితే మీరు డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా నేరుగా ఆసుపత్రికే వారికి కావాల్సిన కెమికల్స్‌ తెచ్చి ఇస్తే మీకు వారి కాంట్రాక్టు చేసుకుని సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంటుంది. కానీ, ఆస్పత్రులకు కొన్ని కెమికల్స్‌ కచ్చితంగా వాడాలనే నిబంధనలు ఉంటాయి. వాటి ప్రొడక్షన్‌ సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసి మీ గోడౌన్‌ లో భద్ర పరిచి, ఎమ్మార్పీ రేటుకు అమ్ముకున్నా మీకు చాలా లాభం వస్తుంది. లేకుంటే ఎమ్మార్పీ ధరకు 10 శాతం డిస్కౌంట్‌ మాట్లాడుకున్నా, మీకు మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కెమికల్స్‌ ఎమ్మార్పీ కన్నా 40 నుంచి 30 శాతం హోల్‌ సేల్‌ ధరలో మీకు లభించే అవకాశం ఉంది. అప్పుడు మీకు లాభసాటి వ్యాపారం కావచ్చు. అలాగే మీ కాంట్రాక్టు కూడా నిరంతరం కొనసాగుతుంది.

మోడీ ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాలతో ఈ వ్యాపారం స్టార్ట్‌ మొదటు పెట్టవచ్చు. సరుకును డిస్ట్రిబ్యూషన్‌ కోసం ట్రక్‌ కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే…లీజుకు కూడా తీసుకోవచ్చు. అంతేకాదు గోడౌన్‌ కోసం తక్కువ రెంట్‌ కలిగి ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా రెంట్‌ డబ్బులు మిగిలే అవకాశం ఉంది. మీ వ్యాపారం విస్తరించడానికి ఒక మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ను పెట్టుకుంటే మీకు ఆర్డర్లు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news