బిజినెస్ ఐడియా: కొబ్బరిపొడి వ్యాపారంతో అదిరే లాభాలని పొందండి..!

-

ఉద్యోగం మీద ఇష్టం లేదా…? ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ వ్యాపారాన్ని కనుక మీరు చేస్తే నెలకు లక్ష కంటే ఎక్కువ మీరు సంపాదించచ్చు. అదే కొబ్బరి పొడి తయారీ ప్లాంట్. ఈ వ్యాపారం తో మంచిగా లాభాలు వస్తాయి పైగా డిమాండ్ కూడా ఎక్కువే.

 

మనం ఎక్కువగా కొబ్బరికాయలుని మనం వాడుతూ ఉంటాము. కనుక కొబ్బరికాయల కొరత ఉండదు. ఈ కొబ్బరి పొడిని తయారు చేసి అమ్మితే మంచిగా బిజినెస్ అవుతుంది. వంటల్లో ఎక్కువగా దీనిని అంతా వాడుతూ ఉంటారు. అయితే ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. కానీ మీరు వెంటనే దీనిని సేల్ చెయ్యొచ్చు.

షాపుల్లో పది రూపాయలకి కొబ్బరిపొడి ప్యాకెట్లు అమ్ముతుంటారు. బ్యాకరీలు, హోటల్లో, షాపుల్లో కూడా దీనిని అమ్ముతూ ఉంటారు. ఇలా మీరు వాటిని అమ్మి డబ్బులు సంపాదించవచ్చు. పైగా ఈ వ్యాపారానికి కేంద్ర ప్రభుత్వం ముద్ర స్కీమ్ ద్వారా 50 వేల రూపాయల నుండి 10 లక్షల వరకు కూడా లోన్ ని ఇస్తుంది. ఈ డబ్బులు తో మీరు చక్కగా బిజినెస్ ని మొదలు పెట్టొచ్చు. అయితే ఈ వ్యాపారం చేయడానికి 1500 చదరపు అడుగుల స్థలం కావాలి. అలానే నీళ్లు, కరెంటు ఉండాలి. పాలిథీన్ సీలింగ్ మిషన్ కావాలి. అలానే మరి కొన్ని పరికరాలు కావాలి. మీరు ఈ వ్యాపారం చేస్తే ఒక లక్ష నుండి 3 లక్షల దాకా పెట్టుబడి పెట్టుకోవాలి. దీనిలో మీకు 40 నుండి 45 శాతం లాభాలు వస్తాయి. ఇలా మీరు నెలనెలా మంచిగా సంపాదించుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version