బిజినెస్‌ ఐడియా: ఈ పేస్ట్‌తో వ్యాపారం చేస్తే.. లాభాల పంటే..! 

-

కరోనా తర్వాత ఇంటి నుంచే ఉద్యోగం మాత్రమే కాదు.. ఇంటి నుంచే వ్యాపారం కూడా పెరిగిపోయింది. చాలా మంది ఇలాంటి బిజినెస్‌ వైపు చూస్తున్నారు. సొంతంగా వ్యాపారం చేయాలన్న ఆలోచన ఈరోజుల్లో యువతలో బాగా పెరిగిపోయింది. మీకు అలాంటి ఆలోచనే ఉంటే.. ఓసారి ఈ బిజినెస్‌ ఐడియా వైపు చూడండి.. ఈ వ్యాపారానికి పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేకపోవడం విశేషం. ఇంకా ఇంటి నుంచే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
ఉల్లి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు.. ఒక్కోసారి విపరీతంగా పెరుగుతాయి.. కేజీ వందకు పైనే పలుకుతుంది. ఈ సీజన్‌లో ఉల్లిపాయలను బంగారం కంటే పొదుపుగా వాడతారు. ఇక ఆయా రాష్ట్రాల్లో అయితే.. ప్రభుత్వాలు సబ్సిడీమీద ఉల్లిపాయలు కూడా ఇస్తాయి. అంత డిమాండ్‌ ఉన్న ఉల్లితోనే మన వ్యాపారం. ధరలు గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు ప్రతీ వంటకం లోనూ ఉల్లి కనిపించడం అరుదుగా మారుతుంది. అటువంటి పరిస్థితితుల్లో ఉల్లి పేస్ట్‌కు డిమాండ్ అధికమవుతుంది. మీరు కూడా ఈ అవకాశాన్ని క్యాచ్ చేసుకోవచ్చు. ఉల్లి పేస్ట్ వ్యాపారాన్ని ఎంచుకోవచ్చు.
ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) ఉల్లి ముద్ద తయారీ వ్యాపారంపై ప్రాజెక్ట్ రిపోర్టును కూడా సిద్ధం చేసింది. దీని ప్రకారం రూ.4.19 లక్షలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. వ్యాపారం ప్రారంభించడానికి మీ వద్ద డబ్బు లేకపోతే, మీరు ప్రభుత్వ ముద్ర పథకం నుంచి రుణం తీసుకోవచ్చు. కేవీఐసీ నివేదిక ప్రకారం.. ఉల్లి పేస్ట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు అయ్యే మొత్తం ఖర్చు రూ.4,19,000. ఇందులో బిల్డింగ్ షెడ్ నిర్మాణానికి రూ.లక్ష, పరికరాలు (ఫ్రైయింగ్ పాన్, ఆటోక్లేవ్ స్టీమ్ కుక్కర్, డీజిల్ ఫర్నేస్, స్టెరిలైజేషన్ ట్యాంక్, చిన్నపాత్రలు, మగ్గులు, కప్పులు మొదలైనవి) కోసం రూ.1.75 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
ఇది కాకుండా, వ్యాపారాన్ని నడపడానికి రూ.2.75 అవసరం అవుతాయి.. ఈ యూనిట్ ద్వారా ఏడాదిలో దాదాపు 193 క్వింటాళ్ల ఉల్లి పేస్ట్‌ను ఉత్పత్తి చేయవచ్చు. క్వింటాకు రూ.3,000 చొప్పున, దాని విలువ రూ.5.79 లక్షలు అవుతుంది.
మార్కెటింగ్ ఎలా అంటే..
ఉల్లిపాయ పేస్ట్ ఉత్పత్తి అయిన తర్వాత, దానిని బెస్ట్ ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. ప్యాకింగ్‌ చాలా నాణ్యతగా చేయాలి..లేకుండే పేస్ట్ పాడైపోతుంది. మీరు మార్కెటింగ్ పర్సన్స్ సహాయం తీసుకోవచ్చు. ఇందుకోసం సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకోవచ్చు. మీరే ఒక వెబ్‌సైట్‌ను సృష్టించడం ద్వారా కూడా మీ ఉత్పత్తిని ప్రమోట్ చేయవచ్చు. మీకు రెండో ఏడాదిని నుంచి మంచి మొత్తంలో డబ్బులు మిగులుతాయి. బిజినెస్ బాగా డెవలప్ అయితే.. ఆదాయం అదే తీరుగా పెరుగుతుంది. అయితే ఉల్లిపేస్ట్‌ను నగరాల్లో, పట్టణాల్లోనే బాగా వాడతారు. మీ వ్యాపారం కూడా అలాంటి ఏరియాలోనే ఉండాలి. ఊళ్లలో తయారుచేసినా.. సెల్లింగ్‌ మాత్రం నగరాల్లోనే చేసేలా ప్లాన్‌ చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news