బిజినెస్ ఐడియా: మట్టి పాత్రల ద్వారా లక్షల్లో ఆదాయం.. పెట్టుబడి తక్కువే..!

-

మీరు ఏదైనా బిజినెస్ ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ని కనుక మీరు ఫాలో అయ్యారంటే లక్షల్లో ఆదాయం వస్తుంది. పైగా ఎలాంటి రిస్క్ ఉండదు. పెట్టుబడి కూడా తక్కువే. మరి ఇంక ఆ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలు చూసేద్దాం.

 

పూర్వకాలంలో మన ఇళ్ళల్లో కుండలను ఉపయోగించేవారు. వంటలను కూడా మట్టి పాత్రలోనే చేసేవారు. అయితే ఈ మధ్యకాలంలో వాటి వాడకం బాగా తగ్గిపోయినప్పటికీ ప్లాస్టిక్, స్టీలు వంటి వాటికంటే మట్టి ఆరోగ్యం అని మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ప్రజల్లో పర్యావరణం ఆరోగ్యం పై అవగాహన బాగా పెరిగింది అందుకనే మట్టి పాత్రల్ని వాడుతున్నారు.

మీరు కనుక మట్టిపాత్రలను తయారు చేయడం మొదలు పెట్టి సేల్ చేసారు అంటే మంచిగా రాబడి వస్తుంది. ఇళ్లల్లోనే మీరు మట్టి పాత్రలు తయారు చేసి వాటిని మార్కెటింగ్ కి వివిధ పద్ధతులను ఉపయోగించి సేల్ చేసారు అంటే చక్కటి లాభాలు వస్తాయి. కుండలు తయారు చేయడానికి మట్టి అవసరం అవుతుంది. అలానే బొగ్గు, కలప కాల్చడానికి కావాలి.

మీరు కావాలంటే మార్కెట్ లో ఒక చిన్న షాప్ ని ఓపెన్ చేసి అక్కడ అమ్మచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా అమ్మచ్చు. పెట్టుబడి కేవలం మీ యాభై వేల రూపాయలు అవుతుంది. అయితే మొదట మీరు బాగా కష్ట పడాల్సి వస్తుంది కుండల వ్యాపారం ద్వారా 20 నుంచి 25 వేల వరకు లాభం పొందవచ్చు. క్రమంగా మీ వ్యాపారం పెరిగేకొద్ది లక్షల్లో ఆదాయం వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news