తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు ఇంకా ఎన్ని రోజులు చేస్తాం.. ఏదైనా బిజినెస్ పెడదాం అనుకుంటున్నారా..? మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే.. ఈ ఫుడ్ బిజినెస్ చేయొచ్చు. దీనివల్ల లాభాలే కానీ నష్టం అనే మాట ఉండదు. పెట్టుబడి మాత్రం కాస్త ఎక్కువగానే అవుతుంది. అయినా సరే లాభం దండిగా ఉంటుంది. ఫుడ్ రిటైల్ ఫ్రాంఛైజీ స్టార్ట్ చేస్తే కళ్లు చెదిరే ప్రాఫిట్ సొంతమవుతుంది. ప్రస్తుతం ఇండియాలో KFC ఉత్తమ ఫుడ్ రిటైల్ ఫ్రాంఛైజీ ఎంపికగా నిలుస్తోంది. ఎందుకంటే ఇది మంచి ట్రాక్ రికార్డ్‌తో మోస్ట్ పాపులర్ బ్రాండ్‌గా ఎదిగింది.
ఈ ఫ్రాంచైజీ మంచి లాభాలను కూడా అందిస్తుంది. KFC ఫ్రాంఛైజర్ ఎప్పటినుంచో పేరు, ప్రొడక్ట్స్, బిజినెస్ మోడల్‌ను ఉపయోగించుకునే హక్కును ఫ్రాంఛైజీలకు విక్రయిస్తోంది. ఫ్రాంఛైజీలు ఈ హక్కును కొనుగోలు చేసి సొంత KFC రెస్టారెంట్లను ఓపెన్ చేసుకోవచ్చు. KFC ఫ్రాంఛైజర్ ఫ్రాంఛైజీకి బిజినెస్ ఎలా ఆపరేట్ చేయాలో ట్రైనింగ్, సపోర్ట్ అందిస్తుంది. బదులుగా ఫ్రాంఛైజీ KFCకి ఫీజు లేదా రాయల్టీని చెల్లించాల్సి ఉంటుంది. KFC అనేది ఫ్రైడ్ చికెన్‌ను విక్రయించే ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చెయిన్. మెక్‌డొనాల్డ్స్ తర్వాత ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రెస్టారెంట్ చెయిన్‌గా ఎదిగింది.
కాబట్టి ఈ కంపెనీ బ్రాండ్‌ను ఉపయోగించుకోవడం ద్వారా కస్టమర్లను సులభంగా అట్రాక్ట్ చేయవచ్చు. “ఫింగర్-లికింగ్ గుడ్” నినాదంతో ఫుడ్ ఐటమ్స్ ఈజీగా సేల్ చేస్తూ సక్సెస్ కావచ్చు. KFC ఆఫర్ చేసేది మోస్ట్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ మోడల్ కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఆకర్షణీయమైన రాబడి అందుకోవచ్చు.
కంపెనీ 20 ఏళ్లకు పైగా భారతదేశంలో వ్యాపారం చేస్తూ నమ్మకమైన కస్టమర్ బేస్‌ను KFC సంపాదించింది. KFC బలమైన మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ క్యాంపెనింగ్ కూడా కలిగి ఉంది. కాబట్టి రెస్టారెంట్‌కి కస్టమర్లను ఆకర్షించడానికి ఫ్రాంఛైజీలు కష్టపడాల్సిన అవసరం ఉండదు.
ఇండియాలో KFC ఫ్రాంఛైజీని ఓపెన్ చేయడానికి అవసరమైన ప్రారంభ పెట్టుబడి రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్లు అవుతుంది. ఏరియా, సెలెక్ట్ చేసుకున్న ఔట్‌లెట్ రకాన్ని బట్టి ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ మారుతుంది. టైర్-1 సిటీలో ఎక్కువ కాస్ట్ ఉంటే టైర్ 2, 3 లొకేషన్స్‌లో పెట్టుబడి తక్కువ అవసరం అవుతుంది.
ఒకవేళ మాల్/ఫుడ్ కోర్ట్‌లో KFC ఫ్రాంఛైజీ ఏర్పాటు చేయాలంటే రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షలు పెట్టుబడి అవసరమవుతుంది. స్టాండలోన్ KFC ఔట్‌లెట్‌కు ఫ్రాంఛైజీ ఫీజు(రూ.30 లక్షలు)తో కలిపి రూ.70 లక్షల నుంచి రూ.1.5 కోట్లు ఖర్చవుతుంది. రెస్టారెంట్‌కు తగిన లొకేషన్‌ను కనుగొని, అవసరమైన లైసెన్స్‌లు, పర్మిట్‌లను కూడా పొందాలి.
ఈ బిజినెస్ స్టాట్ చేయడం కష్టం కానీ లాభంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అక్కర్లేదు. ఆన్‌లైన్ రిపోర్ట్స్ ప్రకారం..10 శాతం యావరేజ్ ప్రాఫిట్‌తో ఇండియాలో ఫ్రాంఛైజీలు సంవత్సరానికి సగటున రూ.57 లక్షల నుంచి రూ.73.4 లక్షల వరకు ప్రాఫిట్ సంపాదించవచ్చు. అంటే నెలకు రూ.6-7 లక్షలు పొందొచ్చు. సేల్స్ ని బట్టి ఈ ప్రాఫిట్ అనేది మారుతుంది. ఇంట్రస్ట్ ఉంటే అన్నీ ఆలోచించుకోని స్టెప్ తీసుకోవచ్చు. ఇదే అనే కాదు.. వ్యాపారంలో ఫుడ్ బిజినెస్ ఎప్పుడు లాభాలనే ఇస్తుంది. కాకపోతే ప్రారంభంలో కష్టపడాల్సి ఉంటుంది.