ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యాపారాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియాస్ మీకోసం. పల్లెటూర్లలో కూడా ఈ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఈ వ్యాపారాల కోసం మీరు ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు చెయ్యాల్సిన పని లేదు తక్కువ పెట్టుబడి తో లక్షల్లో ఆదాయం పొందొచ్చు.
వర్మి కంపోస్ట్:
ఈ మధ్యకాలంలో సేంద్రియ ఉత్పత్తులు కి ఆదరణ బాగా పెరిగింది చాలామంది కేవలం ఆర్గానిక్ పండ్లు కూరగాయలు వంటి వాటిని తింటున్నారు. ఎరువులు వీటి కోసం చాలా ముఖ్యం. ఎరువుల కొరత చాలా ప్రాంతాల్లో ఉంది కనుక మీరు వర్మి కంపోస్ట్ యూనిట్ ని స్టార్ట్ చేయొచ్చు. దీనిని మొదలు పెట్టడానికి ప్రభుత్వాలు రుణాలను కూడా ఇస్తున్నాయి కాబట్టి తక్కువ పెట్టుబడితో దీనిని మొదలు పెట్టి మీరు లక్షల్లో ఆదాయం పొందొచ్చు.
డైరీ ఫార్మ్:
మీరు ఉండే చోట డైరీ ఫామ్ ని ఏర్పాటు చేయొచ్చు. గేదెలు ఆవులు తో మీరు పాల వ్యాపారం మొదలు పెట్టొచ్చు. ఇది కూడా మంచిగా లాభాలను తీసుకువస్తుంది. పైగా ఆవులు గేదెల ద్వారా వచ్చే పేడను సేంద్రియ ఎరువుగా మీరు వాడొచ్చు చాలా మంది ఎటువంటి వ్యాపారాన్ని చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారు అటువంటి వాళ్ళు వీటిని అనుసరించి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. నిజానికి వ్యవసాయానికి సంబంధించిన స్టార్ట్ అప్ ని మొదలు పెడితే మంచిగా లాభాలు వస్తాయి. ఈ రోజుల్లో అయితే వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాలలో ఆదరణ బాగా పెరిగింది.
బేకరీ ఉత్పత్తులు :
చక్కటి పోషక పదార్థాలతో కూడిన బేకరీ యూనిట్ ని కూడా మీరు మొదలు పెట్టొచ్చు. అద్భుతంగా మీరు ఇలాంటి బేకరీ మొదలు పెడితే రాబడి కూడా బాగా వస్తుంది ఇలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు.