డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో కొన్ని వ్యాపారాలు మంచి లాభాలాను అందిస్తున్నాయి.. అతి తక్కువ వడ్డీతో మొదలు పెట్టె వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఎలాంటి బిజినెస్ చేయాలి.. పెట్టుబడి ఎంత అవుతుంది.. లాభాలు ఎలా ఉంటాయి అనే విషయాలు తెలియకపోవడం వల్ల వెనకడుగు వేస్తుంటారు..తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బిజనెస్.. పూల బిజినెస్. మీరు వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇది మంచి మార్గం.
ఈ వ్యాపారం మొదలు పెట్టె ముందు అన్నీ ఆలోచించాలి.నీటి కొరత లేని చోట పొలాలను ఎంచుకోవాలి. నీరు లేకుండా ఎదగని పువ్వులు చాలా ఉన్నాయి. దీనితో పాటు, వాతావరణానికి అనుగుణంగా సాగు కోసం పూలను ఎంచుకోవాలి. వీలైతే, మీ ప్రాంతం ఆధారంగా మీరు ఏ పువ్వులు పండించాలో వ్యవసాయ నిపునులను అడిగి తెలుసుకోవాలి..ముఖ్యంగా కొన్ని పువ్వులకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో రోజ్ మ్యారిగోల్డ్, గెర్బెరా, ట్యూబెరోస్, జాస్మిన్, ట్యూబెరోస్, గ్లాడియోలస్, క్రిసాన్తిమం మరియు ఆస్టర్ బెల్లీ మొదలైనవి ఉన్నాయి..
పూల వ్యాపారం చేసే ముందు మార్కెట్ ను కూడా కనుక్కోవాలి.. దగ్గరలోని మార్కెట్‌లో పెర్ఫ్యూమ్, అగరబత్తి వంటి కంపెనీలకు అమ్మవచ్చు. ఇది మీ పంటకు మంచి ధరను ఇస్తుంది. ఇది కాకుండా..మీరే మార్కెట్‌లో విక్రయించడం కూడా ప్రారంభించవచ్చు..దాని వల్ల మరింత డిమాండ్ కూడా పెరుగుతుంది.2.50 ఎకరాల భూమిలో పువ్వులు నాటడానికి… మీరు 25 వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.మొత్తంగా ఎటు లేదన్నా కూడా 75 నుంచి 80 వేలు పొందవచ్చు.. ఈ బిజినెస్ మీద మీకు ఆసక్తి ఉంటే మీరు కూడా స్టార్ట్ చెయ్యండి..