బిజినెస్ ఐడియా: కుందేళ్ళ పెంపకంతో అదిరే లాభాలను పొందొచ్చు..!

-

చాలామంది ఈ మధ్యకాలంలో బిజినెస్ ని మొదలు పెట్టాలనుకుంటున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా..? దానితో లక్షల రూపాయలు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాని కనుక మీరు ఫాలో అయితే కచ్చితంగా లక్షల్లో ఆదాయం వస్తుంది.

 

ఈ మధ్య కాలంలో చాలా మంది బిజినెస్ వైపు మక్కువ చూపిస్తున్నారు. ఇలా వ్యాపారం చేసే లక్షల ఆదాయాన్ని పొందుతున్నారు. కుందేళ్ళ పెంపకం తో మంచిగా డబ్బులు వస్తాయి. మీరు కనుక కుందేళ్ళ పెంపకం చెయ్యాలంటే పది యూనిట్లతో మొదలు పెడితే నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతుంది. యూనిట్లో మూడు మగ, ఏడు ఆడ కుందేళ్ళు ఉంటాయి.

మరి ఇక ఈ వ్యాపారం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే… కుందేళ్ళ పెంపకం ని మొదలు పెట్టడానికి షెడ్ కోసం లక్షన్నర ఖర్చవుతుంది. కేజ్ విలువ అయితే లక్ష రూపాయల నుంచి లక్షా 25 వేలు ఉంటుంది. వీటిని పెంచడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. కుందేళ్ళ బోను శుభ్రం చేయడానికి వాటికి మేత వేయడానికి ఎవరినైనా మీరు పెట్టుకుంటే చాలు. ఈ వ్యాపారంతో పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుంది.

ఆడ కుందేలుకి 30 రోజులు గర్భధారణ కాలం తర్వాత ఆరు నుండి ఏడు పిల్లలకి జన్మిస్తాయి. ఏడాదికి ఒక కుందేలు ఏడు సార్లు గర్భం దాలుస్తుంది ఐదు చొప్పున ఏడు విడతల్లో లెక్క వేసుకుంటే 35 పిల్లలు పుడతాయి. పుట్టిన తర్వాత 45 రోజులకు రెండు కిలోల బరువు పెరుగుతాయి.

వాటిని మీరు మార్కెట్లో అమ్ముకోవచ్చు. పట్టణాల్లో నగరాల్లో అయితే ఇంట్లో కుందేళ్ళను ఎక్కువగా పెంచుకుంటారు. అలానే కుందేలు మాంసం కూడా అమ్ముకోచ్చు. ఇలా ఏడాదిలో మీరు కుందేలు పిల్లల్ని అమ్మడం వల్ల 10 లక్షల రూపాయలు వస్తాయి. ఎలా చూసుకున్నా మీకు లక్షల్లోనే లాభం వస్తుంది. కాబట్టి ఈ వ్యాపారాన్ని అద్భుతంగా చేసుకుని మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news