బిజినెస్ ఐడియా: ఆర్గానిక్ తేనెతో రూ. 12 లక్షలు…!

-

చాలా మంది ఈ మధ్య కాలంలో వ్యాపారాలను చేస్తున్నారు. వ్యాపారాల ద్వారా మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఎవరికి నచ్చిన వ్యాపారాన్ని వాళ్లు అనుసరించి లక్షల్లో లాభాలను పొందుతున్నారు. గుజరాత్ కి చెందిన తాన్వి, హిమాన్షు పటేల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయ భూమిలో కెమికల్స్ లేకుండా ఈ జంట పండించారు.

కెమికల్స్ వంటి వాటి వల్ల ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందని… ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఇలా వాళ్లు పొందిన జ్ఞానంతో తేనెను కూడా తయారు చేసి అమ్ముతున్నారు. దేశ వ్యాప్తంగా వీళ్ళు తేనేను సప్లై చేయడం జరుగుతోంది. ముందు రెండు చెక్కల కేటులని మొదలుపెట్టి ఇప్పుడు 100, 500 కూడా చేస్తున్నారు.

వీళ్లు తేనే తయారు చేస్తూ మంచిగా లాభాలను పొందుతున్నారు. అయితే తేనెటీగలు చుట్టూ ఉండే కెమికల్స్ వల్ల మరణిస్తాయి. ఈ కారణంగా మూడు లక్షలకి పైగా నష్టం వారికి వచ్చింది. ఆ తరువాత దీనిలో జాగ్రత్తలు తీసుకుని చక్కగా తేనే వ్యాపారం చేస్తున్నారు. లక్షా యాభై వేల రూపాయిలను మెయింటనెన్స్ కింద ఖర్చు అవుతోంది.

అయితే తేనెను తయారు చెయ్యడానికి 12 గంటలు పడుతుంది. ఇలా వాళ్లు ఆర్గానిక్ తేనె ద్వారా నెలకు తొమ్మిది లక్షల నుంచి 12 లక్షలు సంపాదిస్తున్నారు. సుమారు 300 కిలోలు తేనెను సప్లై చేస్తున్నారు. ఇలా తేనే ద్వారా అదిరే లాభాలను ఈ జంట పొందుతున్నారు. మీకు కూడా ఈ ఐడియా నచ్చితే ఫాలో అయితే లక్షల్లో లాభాలుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news