ఉద్యోగ ప్రకటనతో కాంగ్రెస్ ,బీజేపీల్లో వణుకు మొదలైంది: హరీష్ రావు

-

ఉద్యోగ ప్రకటనతో కాంగ్రెస్, బీజేపీల్లో వణుకు మొదలైందని అన్నారు హరీష్ రావు. ఎన్నికల్లో హామీ ఇచ్చినా ఇవ్వకున్నా అనేకు పథకాలు అమలు పరుస్తున్నామని అసెంబ్లీ వేదికగా వెల్లడించారు హరీష్ రావు. 60 ఏళ్లు అధికారంలో  ఉన్నా.. కాంగ్రెస్ గ్రామాల డెవలప్మెంట్, మంచినీరు సదుపాయాల గురించి ఆలోచించలేదని ఆరోపించారు. బట్టి విక్రమార్క సూచన ఇవ్వడం మానేసి విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణకి కేంద్రం అన్యాయం చేస్తోందని.. 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. కేంద్ర సర్వీసుల్లో 25 శాతం ఖాళీలుగా ఉన్నాయని హరీష్ రావు అన్నారు. బీజేపీ ఉద్యోగ నియామకాలపై శ్వేత పత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేము ఒక్క రోజే 80 వేల ఉద్యోగాల భర్తీని ప్రకటించామని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలా చేయలేదని అన్నారు. బీజేపీ వాళ్లు ఫేక్ వాట్సాఫ్ యూనివర్సిటీతో అబద్ధాలు అడటం అలవాటే అని విమర్శించారు. రైతుల బాగుతో పాటు రైతు కుటుంబాల బాగు గురించి ఆలోచించి రైతుబీమాను తీసుకువచ్చామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news