చాలా మంది వాళ్ళు చేసే ఉద్యోగం తో పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ పొందాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. విద్యార్థులు కూడా పాకెట్ మనీ కింద డబ్బులు పొందాలని.. కాలేజీ అయిపోయిన తర్వాత ఏదైనా పని చేయాలని అనుకుంటారు. అదే విధంగా గృహిణిలకి కూడా ఈ వ్యాపార ఐడియాలు బాగా పని చేస్తాయి. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ బిజినెస్ ఐడియాస్ గురించి ఓ లుక్ వేద్దాం.
బ్లాగింగ్:
బ్లాగింగ్ చేయడం వల్ల మంచిగా ఇన్కమ్ వస్తుంది. మీరు మీ ఖాళీ సమయంలో ఏదైనా వెబ్ సైట్ కి లేదా కంపెనీలకు బ్లాగింగ్ చేయొచ్చు. దీనితో మీకు మంచిగా డబ్బులు వస్తాయి.
ట్యూటరింగ్:
దీని వల్ల కూడా మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. మీరు మీకు నచ్చిన సబ్జెక్టుని పిల్లలకు నేర్పించి దాని ద్వారా డబ్బులు పొందొచ్చు. ఇలా మీరు మీ కాళీ సమయంలో డబ్బులు సంపాదించడానికి అవుతుంది.
పెట్ కేర్ సర్వీస్:
పెట్ కేర్ సర్వీస్ కూడా చాలా మంచి ఐడియా. ఇది కూడా మంచిగా డబ్బులని ఇస్తుంది సాయంత్రం పూట మీరు ఫ్రీ అయిపోయాక పెట్ కేర్ సర్వీసింగ్ లో కాసేపు మీ యొక్క సమయాన్ని వెచ్చించి మంచిగా డబ్బులు సంపాదించవచ్చు.
టిఫిన్ సర్వీస్:
టిఫిన్ సర్వీస్ కూడా చాలా బాగా డబ్బులు ఇస్తుంది. మీరు ఖాళీ సమయంలో టిఫిన్స్ ని డెలివరీ చేస్తే డబ్బులను బాగా పొందొచ్చు ఇది కూడా మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఇలా ఈ విధంగా మీ పని పూర్తి అయిపోయిన తర్వాత రోజులో కాస్త సమయాన్ని వీటిపై వెచ్చిస్తే తప్పకుండా మంచిగా డబ్బులు పొందొచ్చు. పైగా ఎక్కువ శ్రమ కూడా మీరు పడక్కర్లేదు.