గూగుల్ పే లో అదిరే ఫీచర్.. ఇలా కూడా మనీ ట్రాన్స్ఫర్ చెయ్యచ్చు..!

-

ఈ మధ్య కాలంలో డిజిటిల్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే మొదలైన యాప్స్ నుండి చాలా మంది ట్రాన్సక్షన్స్ చేస్తున్నారు. అయితే ప్రముఖ​ పేమెంట్​ సంస్థ గూగుల్ పే మరో కొత్త ఫీచర్​ను​ ప్రకటించింది. ఇక దానికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

‘ గూగుల్ ఫర్ ఇండియా 2021’ విజన్‌లో భాగంగా దీనిని తీసుకు రావడం జరిగింది. మాములుగా ఇప్పుడైతే యూపీఐ నంబర్​ ఎంటర్​ చేసి సెండ్​ కొడితే చాలు అవతలి వ్యక్తి ఖాతాలోకి డబ్బులు వెళ్తాయి. కానీ దీనిని ఇప్పుడు మరెంత ఈజీ చేసారు.

అడ్వాన్స్​డ్​గా వాయిస్​ బేస్డ్​ మనీ ట్రాన్స్​ఫర్​ ఆప్షన్​పై గూగుల్​ పే పనిచేస్తోంది. దీనితో మనం వాయిస్ కమాండ్ ఇస్తే సరిపోతుంది. డబ్బులు కూడా సెండ్ అవుతాయి. ఇంగ్లిష్​, హిందీ రెండు భాషలకు మద్దతిస్తుంది. బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తమిళం, తెలుగు వంటి భాషల్లోనూ ఈ ఫీచర్ ​అందుబాటులోకి రానుంది.

అదే విధంగా చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని గూగుల్​ పే ‘మై షాప్​’ ఫీచర్‌ని కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు 10 మిలియన్ల వ్యాపారులు గూగుల్​ పేని ఉపయోగిస్తున్నారు. గూగుల్​ పే లో వ్యాపారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇటువంటి సమయంలో కొత్తగా లాంచ్​ అవుతోన్న మై షాప్​ ఫీచర్​ చిరు వ్యాపారులకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news