బిజినెస్ ఐడియా: వెంట్రుకలతో వ్యాపారం..కిలో రూ.25 వేలు..కోట్లు గ్యారెంటీ..

మన వెంట్రుకలు అందానికే కాదు..కోట్లు కూడా తెచ్చి పెడుతున్నాయి..ప్రపంచ వ్యాప్తంగా వీటితో కోట్ల వ్యాపారం నడుస్తుంది.మన దేశంలోనూ వెంట్రుకలతో వ్యాపారం చేసే వారు చాలా మందే ఉన్నారు.వాటినే వ్యాపారంగా మార్చుకొని చాలా మంది బిజినెస్ చేస్తున్నారు.విదేశాలకు ఎగుమతి చేసి.. కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఇండియా నుంచి దాదాపు 4 మిలియన్ డాలర్ల విలువైన జుట్టు విదేశాలకు ఎగుమతి అవుతోంది.

2020లో విదేశాలకు పంపిన తల వెంట్రుకల్లో 39 శాతం వార్షిక పెరుగుదల నమోదయింది. తల నుంచి కత్తిరించిన ఈ వెంట్రుకలతో కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది. అందుకే గ్రామీణ ప్రాంతాలే కాదు.. పట్టణాల్లో కూడా ఇంటింటికీ వెళ్లి వెంట్రుకలను సేకరిస్తారు..జుట్టు నాణ్యత బట్టి ధర ఉంటుంది. తక్కువలో తక్కువ.. కిలోకు రూ.8వేల నుంచి 10 వేల ధర పలుకుతుంది. వెంట్రుకల మరింత నాణ్యంగా ఉంటే ఈజీగా రూ.20వేల నుంచి 25 వరకు ధర లభిస్తుంది. ఎంత పొడవు ఉంటే.. అంత ఎక్కువ రేటు వస్తుంది. కోల్‌కతా, చెన్నై, ఏపీలోని వ్యాపారవేత్తలు హోల్‌సేల్‌గా వెంట్రుకలను కొనుగోలు చేస్తారు. ఆ వెంట్రుకలను విదేశాలకు ఎగుమతి చేసి.. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కోల్‌కతా నుంచి 90శాతం వెంట్రుకలను చైనాలోనే విక్రయిస్తున్నారు.

అయితే,గుజరాత్ వెంట్రుకలకు మార్కెట్‌లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. అక్కడి వెంట్రుకలు దృఢంగా, మెరుస్తూ ఉండడం వల్లే డిమాండ్ అధికంగా ఉంటుంది. రేటు కూడా బాగుటుంది.ఈ వెంట్రుకలను హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో పాటు విగ్గుల తయారీలో వినియోగిస్తారు. కత్తిరించిన జట్టును శుభ్రం చేసి.. ఆ తర్వాత రసాయనాల్లో ఉంచుతారు. అనంతరం స్ట్రెయిట్ చేసి వాడుతారు. పూర్తిగా సిద్ధమైన తర్వాత చైనా వంటి విదేశాలకు ఎగుమతి చేస్తారు. వెంట్రుకల పొడవు కనీసం 8 అంగుళాలు ఉండాలి. అలాంటి వాటికే విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

మన దేశంలోని ఆడ వారి జుట్టుకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు..రంగు వేయని జట్టుకైతే.. మార్కెట్లో మంచి రేటు వస్తుంది. బాగా పొడవు ఉండి.. నిగనిగలాడే దృఢమైన జట్టుకు.. కిలోకు రూ.50వేల వరకు చెల్లిస్తారు. ఆసియాలోని చైనా, మలేషియా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్ దేశాలకు పంపిస్తారు. అమెరికా, యూరప్‌లో దేశాలు కూడా భారత్ నుంచి వెంట్రుకలను కొనుగోలు చేస్తాయి..

ఇక్కడ దేశంలోని ఆలయాల్లో భక్తులు తలనీలాలు ఇస్తుంటారు.ముఖ్యంగా తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్ల నిత్యం వేలాది మంది తలనీలాలు సమర్పిస్తారు. అలా భక్తులు సమర్పించిన వెంట్రుకలను టీటీడీ వేలంలో విక్రయిస్తారు. 2014లో రూ.220 కోట్ల వెంట్రుకలను విక్రయించారు. మీరు కూడా ఇలాంటి వ్యాపారం చేయాలనుకుంటే ఇంటికి ఇంటికీ తిరిగి జుట్టును సేకరించే వారితో పాటు ఆలయాలతో ఒప్పందం చేసుకోవచ్చు.ఆ తర్వాత ఆ జుట్టును పెద్ద కంపెనీలకు అమ్మోవచ్చు..బాగుంది కదా ఈ ఐడియా.. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..