Viral Video: డేంజరస్ స్టంట్.. డివైడర్‌ పైనుంచి ఎగిరిపడ్డ కారు!

-

ఇటీవల చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని రకరకాల స్టంట్స్ చేస్తున్నారు. ఫేమస్ అవ్వాలనే నెపంతో ప్రాణాలు పణంగా పెడుతున్నారు. దీంతో ఈజీగా సోషల్ మీడియాలో వీవ్స్ సంపాదించుకోవచ్చనే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వేసిన స్టంట్‌కు అందరూ ఆశ్చర్యపోయారు. జాతీయ రహదారిపై కారులో ఓ వ్యక్తి వేగంగా వెళ్తుండగా కారు డోరు తెరిచి విన్యాసాలు చేశాడు. దీంతో ఆ కారు అదుపు తప్పింది.

road accident
road accident

డివైడర్ పైనుంచి అవతలి రోడ్డుపై ఎగిరిపడి రేలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన చంఢీఘడ్-సిమ్లా జాతీయ రహదారిపై జరిగింది. అమృత్‌సర్‌కు చెందిన ఓ డ్రైవర్ కారులో  విన్యాసాలు చేశాడు. అదే సమయంలో మరొక కారు ఢీకొట్టడంతో డివైడర్ పైనుంచి కారు పల్టీ కొట్టింది. కారు తుక్కు తుక్కైంది. వేగంగా కారు నడపడం వల్లే ఇలా జరిగిందని పోలీసులు డ్రైవర్‌పై కేసు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news