గ్రామాల్లో ఉంటూనే చేయదగ్గ వ్యాపారాలు.. ఐడియా మాది ఇంప్లిమెంటేషన్‌ మీది..!

-

వ్యాపారం చేయాలంటే.. బాగాచదువుకోని, లక్షల్లో పెట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఈ రెండు లేకుండా కూడా మంచి మంచి వ్యాపారాలు చేయొచ్చు. దండిగా సంపాదించవచ్చు. గ్రామాల్లో ఉంటూనే చేయదగ్గ కొన్ని అమేజింగ్‌ బిజినెస్‌ ఐడియాస్‌ ఉన్నాయి. మీరు నివసించే ప్రాంతంలో చిన్న వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి తక్కువ మూలధనం చాలు. వ్యాపారాన్ని ప్రారంభించడం అంత సులభం కాదు. గ్రామీణ ప్రజలకు ఇది మరింత కఠినంగా ఉంటుంది. అయితే సరైన టెక్నిక్స్‌తో ముందుకెళ్తే విజయం ఖాయం.

పుట్టగొడుగుల పెంపకం:

పుట్టగొడుగుల పెంపకం, మారికల్చర్ అని కూడా పిలుస్తారు.. పుట్టగొడుగులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కొన్ని ఏరియాల్లో మటన్‌ అంత కాస్ట్‌ ఉంటుంది. పుట్టగొడుగులు పెంచాలమంటే.. మీకు పెద్దగా స్థలం కూడా అవసరం లేదు. ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిని ఎలా పెంచాలి, ఎంత ఖర్చు అవుతుందో మీ దగ్గర్లోని వ్యవసాయ కేంద్రంకు వెళ్తే వాళ్లు అన్నీ క్లియర్‌గా చెప్తారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ వ్యాపారం చేయాలనుకునేవారికి లోన్‌ సదుపాయం కూడా ఇస్తుంది.

కోళ్ల ఫారాలు:

చిన్న తరహాలో కోళ్ల పెంపకం ప్రారంభించి పశువుల పెంపకం లాగానే పరిగణించవచ్చు. ఇతర వ్యవసాయ కార్యకలాపాలతో పోలిస్తే ఈ వ్యాపార ఆలోచనకు తక్కువ ఆర్థిక పెట్టుబడి, శ్రమ అవసరం. పౌల్ట్రీ ఉత్పత్తులకు డిమాండ్ స్థిరంగా ఉంటుంది, చిన్న కమ్యూనిటీలలో నివసించే వ్యక్తులకు స్థిరమైన అవకాశాలను అందిస్తుంది.

కూరగాయల సాగు:

కూరగాయల సాగుచేయడం కూడా మంచి ఆలోచనే. దీనికి పొలం కావాలి. ఒకటే రకం కాకుండా.. మార్కెట్‌లో అవసరాలకు తగ్గట్టుగా మీరు కూరగాయలు, ఆకుకూరలు పండిస్తే.. మంచి లాభాలను పొందవచ్చు. మీరు ఆర్గానిక్‌ పద్ధతిలో పండిస్తే..మీ పంటకు ఇంకా డిమాండ్‌ ఉంటుంది.

బనానా చిప్స్ తయారీ:

కార్బ్ ఆధారిత చిప్ ప్రత్యామ్నాయంగా అరటి చిప్స్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ చిరుతిళ్లను ఉత్పత్తి చేసి విక్రయించే కేంద్రీకృత సంస్థను ప్రారంభించడం కనీస ప్రారంభ ఆర్థిక వ్యయంతో సాధించవచ్చు. ఈ విధానం చాలా సులభం, ఆహార రంగంలోకి ప్రవేశించడానికి ఆసక్తి ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇది మంచి ఎంపిక. సరైన వంటకం, మార్కెటింగ్ వ్యూహాలను ఉపయోగించడం ద్వారా అరటి చిప్స్ వ్యాపారాన్ని స్థాపించవచ్చు.

పిండి మిల్లు:

గ్రామీణ ప్రాంతాల్లో, పిండి మిల్లును ఏర్పాటు చేయడం లాభదాయకమైన వ్యాపారం. అన్ని రకాలు పిండి పట్టడం, కారం చేయడం వల్ల మంచి లాభం ఉంటుంది. అయితే ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న పని. పైగా.. గ్రామంలో ఇంతకుముందే ఒకటికంటే ఎక్కువ పిండిమిల్లులు ఉంటే..మీరు ఈ వ్యాపారం చేయకపోవడమే బెటర్‌. ఎందుకంటే.. ఏ వ్యాపారం అయినా కాంపిటీషన్‌ తక్కువగా ఉంటే.. త్వరగా క్లిక్‌ అవుతుంది. పిండిమిల్లులకు ఏడాది పొడవునా డిమాండ్ ఉండదు. సీజన్లో మాత్రమే ఉంటుంది. ఆ గ్రామంలో మీదే అయితే.. మీకు డబ్బులు మిగులుతాయి. చిన్న గ్రామంలో చాలా ఉన్నాయి అంటే..పెద్దగా ప్రయోజనం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news