బిజినెస్ ఐడియా: చాయ్ బండి పెట్టి లక్షలు సంపాదిస్తున్న ఇంజనీర్.. గ్రేట్ ఐడియా..

-

ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువుకున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుంది.కానీ ఉద్యోగాలు మాత్రం సగం మందికే వస్తున్నాయి.చాలా మంది ఉద్యోగం రాలేదని నిరాశలోకి వెళ్ళి పోయి ఏదోకటి చేసుకొని జీవితాన్ని ముగిస్తున్నారు. మరి కొంత మంది మాత్రం ఏదొక చిన్న వ్యాపారం మొదలు పెట్టి కళ్ళు చెదిరె లాభాలను పొందుతున్నారు. మొన్నీమధ్య కేరళలోని ఇంజనీర్ ఉద్యోగులు కరొన వల్ల ఉద్యోగాలు పోవడం తో చాయ్ బిజినెస్ స్టార్ట్ చేసి లక్షలు సంపాదిస్తూ అందరికి ఆదర్షంగా నిలిచారు.ఇప్పుడు మరో ఇంజనీర్ విద్యార్థి చాయ్ బండి పెట్టి లక్షలు వెనకేసుకుంటున్నాడు..అతని బిజినెస్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

 

మహారాష్ట్రకు చెందిన గణేష్ దుధ్నాలే.. గుజరాత్ వాపిలోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. తర్వాత అందరు విద్యార్థుల్లాగే జాబ్స్ కోసం ఎంతో ప్రయత్నించాడు. కానీ ఏ ఉద్యోగం కూడా రాలేదు. పలు ఆఫర్లు వచ్చినా… అవి చాలా తక్కువ జీతం మాత్రమే ఇస్తామనడంతో జాబ్ చేయాలన్న తన కల నెరవేరబోదని బాధపడ్డాడు. తన మనసులో ఉన్న ఓ ఆలోచనను తన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నాడు. ఒక వేళ జాబ్ రాకపోతే ఏం చేయాలన్న దానికి టీ వ్యాపారాన్ని బ్యాకప్ ప్లాన్ గా ఉంచుకున్నాడు గణేష్..

చాయ్ మేకర్ బ్రాండ్ పేరుతో కియోస్క్ ను ప్రారంభించాడు. యాలకులు, అల్లం లాంటి సాంప్రదాయమైన టీ కాకుండా వెరైటీగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. మామిడి, స్ట్రాబెర్రీ, గులాబీ, అరటి, హాట్ చాక్లెట్.. ఇలా ఎన్నో రకాల టీ లను అందిస్తున్నారట.. ఆరోగ్యానికి మంచి చేసే ఈ టీ ల కోసం జనం ఎగబడుతున్నారు..రోజుకు 8 వేలు సంపాదిస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు.నెలకు రూ. 3 లక్షల వరకు ఆదాయం వస్తోంది. రోజూ ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నాడు గణేష్. గుజరాత్ లో 100 అవుట్ లెట్ లు, దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా అవుట్ లెట్ లు ఉండాలని, తన బ్రాండ్ దేశ మంతా ఉండాలని కొరుక్కుంటూన్నారు.. అతని ఆశ, కల నేర వెరాలని ఆశిద్దాం.. ఆల్ ది బెస్ట్..

Read more RELATED
Recommended to you

Latest news