బుల్లితెరపై అందాల యాంకర్ గా, నటిగా పేరు పొందింది యాంకర్ అనసూయ. దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుండి జబర్దస్త్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తూ నే ఉన్నది. ఈ షో ద్వారా ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం అటు వెండితెరపై .. ఇటు బుల్లితెరపై కూడా తన హవాను కొనసాగిస్తోంది. ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు వైపు కూడా తన మార్కును చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది అనసూయ. ప్రస్తుతం అనసూయ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉందని చెప్పవచ్చు. తాజాగా కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రంలో నటిస్తున్నది.ఇక గత ఏడాది అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలో సునీల్ భార్య పాత్రలో బాగా నటించింది. అనసూయకు వివాహమైన తరువాతే పలు అవకాశాలు వస్తూ కెరియర్ చాలా సాఫీగా సాగిపోతోంది. ప్రస్తుతం అనసూయ చిరంజీవి తో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో శుభ గృహ కు సంబంధించి ఒక కమర్షియల్ యాడ్ లో కూడా నటించారు. ఈ యాడ్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ ఉంటుంది అనసూయ.
ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న అనసూయ జబర్దస్త్ షో కి రెమ్యూనరేషన్ గా ఏడాదికి.. రూ.70 లక్షలు అందుకుంటున్న ట్లుగా సమాచారం. మిగిలిన షో లకీ ఒక్కో ఎపిసోడ్ కు లక్ష రూపాయల వరకు అనుకుంటుందట. ఇక సినిమాలకైతే ఒక రోజుకు రూ.1.5 లక్షలు అనుకుంటుందట. ఆడియో ఫంక్షన్ రిలీజ్ అయితే.. రూ.5 లక్షల వరకు అందుకుంటుందట. అనసూయా కి హైదరాబాద్ లో ఒక లగ్జరీ హౌస్ ఉంది. దాని విలువ రూ.8 కోట్లు ఉంటుందట. అనసూయ దగ్గర కేవలం రెండుకార్లు మాత్రమే ఉన్నాయి వాటి విలువ రూ.1.5 కోట్లు. అనసూయ ఆస్తి విలువ సుమారుగా రూ.70 కోట్ల రూపాయలకు పైగా నే ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి.