Business Idea: నేచురల్‌ నూనె తయారీ.. ఇంట్లోనే స్టార్ట్‌ చెయ్యిచ్చు.. డిమాండ్‌ కూడా ఉంది

-

ప్ర‌స్తుత త‌రుణంలో ఆరోగ్యం విష‌యంలో అనేక మంది శ్ర‌ద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా నిత్యం వాడే వంట నూనెల విష‌యంలో చాలా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అందులో భాగంగానే రీఫైన్డ్ ఆయిల్స్ కాకుండా గానుగ‌లో ఆడించిన స‌హ‌జ‌సిద్ధ‌మైన నూనెల‌ను వాడేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. వీటి ధ‌ర ఇత‌ర వంట నూనెల‌తో పోలిస్తే కాస్త ఎక్కువే. అయిన‌ప్ప‌టికీ ఆరోగ్యంగా ఉండేందుకు జ‌నాలు గానుగ‌లో ఆడించిన వంట నూనెల‌ను వాడేందుకే ఎక్కువ ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. అయితే ఇదే గానుగ నూనె త‌యారు చేసి అమ్మే బిజినెస్ చేస్తే.. ఎవ‌రైనా స‌రే.. చ‌క్క‌ని ఆదాయం సంపాదించ‌వ‌చ్చు. మ‌రి.. అదెలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

earn good income by doing cold pressed oil making

గానుగ నూనె త‌యారు చేసేందుకు 10 * 10 సైజ్ ఉన్న గ‌ది చాలు. ఇంట్లోనూ స్థ‌లం ఉంటే మెషిన్ పెట్టుకుని ఈ వ్యాపారం చేయ‌వ‌చ్చు. ఇక ఈ మెషిన్ కెపాసిటీని బ‌ట్టి ఖ‌రీదు ఉంటుంది. 10, 15, 20 కేజీల మెషిన్లు రూ.1.50 ల‌క్ష‌లు మొద‌లుకొని మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. 20 కేజీల మెషిన్‌తో అయితే ఎక్కువ నూనెను ఒకేసారి ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చు. ఇక కేవ‌లం ఒక్క‌రు ఉన్నా చాలు.. ఈ మెషిన్‌ను ఆప‌రేట్ చేసుకోవ‌చ్చు. ఇందుకు క‌రెంట్‌, ముడి ప‌దార్థాలు ఖర్చ‌వుతాయి. మ‌హిళ‌లు, నిరుద్యోగులు ఈ బిజినెస్‌తో చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి పొంద‌వ‌చ్చు.

గానుగ నూనె త‌యారీ మెషిన్ (20కేజీలు) లో కొబ్బ‌రి, ప‌ల్లీలు, నువ్వులు త‌దిత‌ర ముడిప‌దార్థాల‌ను వేసి నూనె తీయ‌వ‌చ్చు. 20కేజీల ముడిప‌దార్థాన్ని ఆడించేందుకు సుమారుగా 1 గంట ప‌డుతుంది. అదే 8 గంట‌లు ప‌నిచేస్తే 8 * 20 = 160 కేజీల ముడిప‌దార్ధాన్ని ఆడించ‌వచ్చు. అందులో సుమారుగా 40 శాతం వ‌ర‌కు.. అంటే.. దాదాపుగా 64 కేజీల వ‌రకు నూనె వ‌స్తుంది. అది 70 లీట‌ర్లు అవుతుంది. దాన్ని మార్కెట్‌లో లీట‌ర్‌కు రూ.50 లాభం చూసుకుని అమ్మినా 70 * 50 = 3500 వ‌స్తుంది. ఇలా నిత్యం రూ.3500 బిజినెస్ చేస్తే నెల‌కు 30 * 3500 = రూ.1,05,000 వ‌స్తాయి. ఈ క్ర‌మంలో ఖ‌ర్చులు తీసేస్తే నెల‌కు రూ.70వేల నుంచి రూ.80వేల వ‌రకు ఆదాయం సంపాదించ‌వ‌చ్చు. ఇక నూనె తీసేందుకు వాడే ముడి ప‌దార్థాల‌ను బ‌ట్టి మ‌న‌కు వ‌చ్చే ఆదాయం మారుతుంది. ప‌ల్లీలు, నువ్వుల‌కు త‌క్కువ‌గా, కొబ్బ‌రి నూనెకు ఎక్కువ‌గా ఆదాయాన్ని సంపాదించ‌వ‌చ్చు.

గానుగ‌లో నూనె తీయ‌గా వ‌చ్చే చెక్క‌ను కిలో రూ.25 నుంచి రూ.30 చొప్పున డైరీ ఫామ్‌లు, హోట‌ల్స్ కు అమ్మితే ఆ విధంగా కూడా లాభం వ‌స్తుంది. లేదా సొంతంగా నువ్వులు, ప‌ల్లీల చెక్క‌ల‌తో ఉండ‌లు త‌యారు చేసి కూడా అమ్మ‌వ‌చ్చు. అలా కూడా ఆదాయం వ‌స్తుంది. ఇక గానుగ‌లో నూనె తీసే బిజినెస్‌కు ఎలాంటి ప‌ర్మిష‌న్లు అవ‌స‌రం లేదు. మ‌హిళ‌లు, నిరుద్యోగులు సుల‌భంగా ఈ వ్యాపారం చేసుకోవ‌చ్చు. నెల నెలా స్వ‌యం ఉపాధి కింద చ‌క్క‌ని ఆదాయం ల‌భిస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news