డౌట్ కొడుతుంది: జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే చప్పిడి దెబ్బలు!

-

వైకాపా అధినేత జగన్ పేరెత్తితే చాలు.. టీడీపీ నేతలు నిప్పులు చెరిగేస్తుంటారు. ఇప్పటికే ఆ విషయంలో ఫస్ట్ ప్లేస్ కోసం కొట్టుమిట్టాడే నేతలు టీడీపీలో నిత్యం పోటీపడుతూనే ఉంటారు. అలాంటిది “అధిష్టాణం బలవంతంమీద మాట్లాడినట్లుగా” మాట్లాడారన్నట్లుగా ఉన్నాయి… తాజాగా గణబాబు స్పందనపై స్పందించిన తమ్ముళ్ల మాటలు!


వివరాళ్లోకి వెళ్తే… కరోనా విజృంభన సమయంలో ప్రజలు, వ్యాపార సంస్థలు భయపడి శానిటైజర్లు, మాస్కులతో పాటుగా, భౌతిక దూరం పాటిస్తూ అంతటా జాగ్రత్తలు వహిస్తున్నారు కానీ.. మద్యం దుకాణాల వద్ద మాత్రమే తొక్కీసలాటలు, కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కు గణబాబు లేఖ రాశారు.

“మద్యం షాపుల కారణంగా ప్రభుత్వం మూటగట్టుకున్న చెడ్డపేరు మీ వరకు రాలేదంటే.. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందనే చెప్పాలి” మొదలుపెట్టిన గణబాబు… ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చినప్పటికీ.. ఏ ఆస్పత్రిలోనూ కరోనా బాధితులను చేర్చుకునే పరిస్థితులు లేవని.. ముందుగా వైద్య సిబ్బందికి ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ధరల పెంపుపై ప్రభుత్వం పునరాలోచించాలని సీఎం జగన్‌కు లేఖలో గణబాబు విజ్ఞప్తి చేశారు.

ఈ లేఖను పరిశీలించిన తమ్ముళ్లు… ప్రస్తుతం టీడీపీ – వైకాపా మధ్య ఉన్న రాజకీయ యుద్ధంలో… ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే లేఖలో ఉండాల్సిన ఘాటు.. గణబాబు లేఖలో లేదనేది వారి బాదగా ఉంది! అదేముంది… ఎవరి స్టైల్ వారిది.. కొంతమంది గట్టిగా చెబుతారు, మరికొందరు సుతిమెత్తగా చెబుతారు అని సమధానం వస్తోన్నా కూడా తమ్ముళ్లు తగ్గడం లేదంట! ఎల్జీ పాలిమర్స్ సమయంలో… జగన్ బాగా పనిచేశారని స్పందించిన గణబాబు.. నేడు ఇలా జగన్ పై చప్పిడి విమర్శలు చేస్తున్నారని… కొత్త అనుమానాలు క్రియేట్ చేస్తున్నారని ఫీలవుతున్నారంట!! జీవితంలో భయం ఉండాలి కానీ… జీవితమే భయం అయితే ఎలా తమ్ముళ్లూ అని ఈ సందర్భంగా పలువురు సూచిస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news