ఎలాన్ మస్క్​ కొత్త స్కెచ్.. ట్విటర్​కు దీటుగా మరో సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​!

-

Elon Musk New Social Media: సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​లో యాక్టివ్‌గా ఉంటారు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌. తన పోస్టులతో యూజర్లను అప్పుడప్పుడూ తికమక పెడుతుంటారు. కొన్నిసార్లు ఆయన పెట్టే ట్వీట్లు అర్ధం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంటుంది. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్‌ అలాంటి పరిస్థితికే దారి తీసింది.

ట్విట్టర్​ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్ల ఎలాన్​ మస్క్​ ఇటీవలే ప్రకటించగా.. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో ఓ యూజర్​ మస్క్​కు ఓ ప్రశ్న వేశాడు. “ఒకవేళ ట్విట్టర్​ డీల్‌ పూర్తిగా రద్దు అయిపోతే .. మరో కొత్త సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఏమైనా ఏర్పాటు చేస్తారా?” అని ప్రశ్నించాడు. దీనికి మస్క్​ సమాధానంగా ఎక్స్.కామ్​(X.com) అంటూ ట్వీట్ చేశారు. దీంతో మస్క్‌ ఈ పేరుతో కొత్త సామాజిక మాధ్యమాన్ని ప్రారంభించనున్నారంటూ నెటిజన్ల మధ్య చర్చ మొదలైంది.

అయితే ఎక్స్​.కామ్​ అనేది కొత్తదేం కాదు. ఇది గతంలో మస్క్​ నిర్వహించి తర్వాత పేపాల్​లో విలీనం చేశారు. అనంతరం 2017లో మళ్లీ సొంతం చేసుకున్నారు​. ప్రస్తుతం ఎక్స్.డామ్​ డొమైన్​ యాక్టివ్​లోనే ఉంది కానీ అందులో ఎటువంటి సమాచారం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news