బిజినెస్ ఐడియా: ఈ బిజినెస్ లో పెట్టుబడి తక్కువ.. నాలుగింతలు ఆదాయం..

-

బిజినెస్ చేయాలనీ అనుకుంటున్నారా?అయితే మీకో చక్కటి ప్లాన్ అందుబాటులో ఉంది..ఈ బిజినెస్ లో ఎక్కువ శ్రమ అవసరం లేదు..చాలా తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలను పొందవచ్చు.ఈ వ్యాపారం పేరు స్టేషనరీ వ్యాపారం. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మొదలైన వాటికి సమీపంలో స్టేషనరీ వ్యాపారానికి చాలా డిమాండ్ ఉంది. వేసవి సెలవులు ముగిసిన వెంటనే.. ఈ వ్యాపారానికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది.

పెన్నులు పెన్సిల్స్, నోట్‌ప్యాడ్‌లు మొదలైన స్టేషనరీ వస్తువులు దీనిలోకి వస్తాయి. పెళ్లి కార్డులు, గిఫ్ట్ కార్డులు తదితరాలను కూడా స్టేషనరీ షాపులో ఉంచుకోవచ్చు. ఈ రకమైన వస్తువులను అమ్మడం ద్వారా ఎక్కువ డబ్బులను సంపాదించవచ్చు.ముందుగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి.. ‘షాప్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం’ కింద నమోదు చేసుకోవాలి. స్టేషనరీ దుకాణాన్ని ప్రారంభించడానికి మీకు 300 నుండి 400 చదరపు మీటర్ల స్థలం అవసరం. తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మెరుగైన స్టేషనరీ దుకాణం తెరవాలంటే కనీసం 50 నుంచి60 వేల రూపాయలు కావాలి.

షాప్ ప్రమోషన్ కోసం..మీరు ముందుగా స్టేషనరీ దుకాణం పేరును ముద్రించి పంపిణీ చేయవచ్చు. ఇది కాకుండా పాఠశాల, కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు మీ దుకాణం గురించి చెప్పవచ్చు. హోమ్ డెలివరీ సౌకర్యాన్ని అందించడం ద్వారా.. మీ వ్యాపారం త్వరగా అభివృద్ధి చెందుతుంది.

సోషల్ మీడియా గ్రూప్ లలో కూడా మీ షాప్ ను ప్రమోట్ చెయ్యడం మంచిది.వ్యాపారం డెవలప్ అవుతుంది. బ్రాండెడ్ ఉత్పత్తులను విక్రయిస్తే.. 30 నుండి 40 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ స్థానిక ఉత్పత్తులను విక్రయిస్తే.. 2 నుండి 3 రెట్లు వరకు సంపాదించవచ్చు. మీరు 1 లక్ష రూపాయల ఖర్చుతో దుకాణాన్ని తెరిచినట్లయితే.. నెలలో 40 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇంకెందు ఆలస్యం ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అన్నీ సిద్ధం చేసుకోండి..మంచి లాభాలను పొందండి..

Read more RELATED
Recommended to you

Latest news