Business Idea : టెర్రస్‌ ఖాళీగా ఉందా.. ఈ వ్యాపారాలు చేసే డబ్బు సంపాదించేయండి..!

-

ఇంట్లో కుర్చోని కూడా ఏదో ఒక చిన్న బిజినెస్‌ చేసి డబ్బులు సంపాదించవచ్చు. అరే ఏం చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, అసలు స్థలం ఎక్కడ ఉంది అని ఆలోచిస్తున్నారా..? మీ టెర్రస్‌ ఖాళీగా ఉంటే ఇప్పుడు చెప్పుకోబోయే వ్యాపారాలు చేయొచ్చు. వీటి వల్ల బాగా డబ్బులు సంపాదించవ్చు. ఈ వ్యాపారాల ద్వారా నష్టపోయే అవకాశం అసలే లేదు. టెర్రేస్ ఫార్మింగ్, సోలార్ ప్యానెల్స్, మొబైల్ టవర్లు, హోర్డింగ్‌లు ఇంటి పైకప్పుపై బ్యానర్‌లు తదితర పనులు చేయడం ద్వారా మీరు సంపాధించవచ్చు.

మీరు మీ టెర్రస్‌ని అద్దెకు ఇవ్వడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు ఇటువంటి వ్యాపారాలు ప్రారంభించి భారీ లాభాలను అర్జించవచ్చు. టెర్రస్‌ వ్యవసాయం అంటే పైకప్పు మీద వ్యవసాయం. మీరు పెద్ద ఇంటిలో నివసిస్తూ, మీకు పెద్ద డాబా ఉంటే, మీ డాబాపై వ్యవసాయం చేయడం ద్వారా మీరు సులభంగా డబ్బు సంపాదించవచ్చు. ఇందుకోసం పైకప్పుపై పాలీబ్యాగుల్లో కూరగాయల మొక్కలను నాటాలి. టెర్రేస్ గార్డెనింగ్ మీకు ఉన్న ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది. డ్రిప్ సిస్టమ్‌తో నీటిపారుదల చేయవచ్చు. మీ పైకప్పుపై మంచి సూర్యకాంతి ఉండేలా మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అసలే ఈరోజుల్లో అన్నీ కల్తీ కూరగాయాలే.

Business-idea

మీరు మీ పైకప్పుపై సోలార్ ప్లాంట్‌లను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా వ్యాపారం చేయవచ్చు. ఇది మీకు విద్యుత్ బిల్లును ఆదా చేయడమే కాకుండా, పెద్ద మొత్తంలో డబ్బును కూడా సంపాదించవచ్చు. ఇప్పుడు విదేశాల్లో కిటీకీలకు కూడా సోలార్‌ పెడుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం కూడా దీన్ని ప్రోత్సహిస్తోంది. దీని కోసం మీరు ప్రారంభంలో కొంత చిన్న పెట్టుబడి పెట్టాలి.

మీ ఇల్లు నగరంలో ప్రముఖ ప్రదేశంలో ఉండి, దూరం నుంచి సులభంగా కనిపించేలా లేదా రోడ్డు పక్కన నిర్మించబడినట్లయితే, మీరు మీ పైకప్పుపై బ్యానర్లు లేదా హోర్డింగ్‌లను అమర్చడం ద్వారా చాలా సంపాదించవచ్చు. దీని కోసం మీరు అటువంటి ఏజెన్సీని సంప్రదించవచ్చు, ఇది అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాత పైకప్పుపై హోర్డింగ్‌లు అమర్చుతారు. దీని అద్దె మీ ప్రాపర్టీ స్థానాన్ని బట్టి ఉంటుంది.

మీ ఇంటి పైకప్పు ఖాళీగా ఉంటే మీరు దానిని మొబైల్ కంపెనీలకు అద్దెకు ఇవ్వవచ్చు. మొబైల్ టవర్ ఇన్‌స్టాలేషన్ తర్వాత, మీకు కంపెనీ ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది. దీని కోసం మీరు స్థానిక మున్సిపాలిటీ నుంచి అనుమతి పొందాలి. మీరు ఇంట్లో మొబైల్ టవర్‌ను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే మీరు నేరుగా మొబైల్ కంపెనీలను లేదా టవర్ ఆపరేటింగ్ కంపెనీలను సంప్రదించవచ్చు. అయితే దీనివల్ల డబ్బు వస్తుందేమో కానీ ఇతర పంచాయితీలు ఉంటాయి. రేడియేషన్‌ ప్రాబ్లమ్‌ ఉంటుంది కాబట్టి ఇది లైట్‌ తీసుకుంటే బెటర్.

Read more RELATED
Recommended to you

Latest news