బిజినెస్ ఐడియా: మీ మాటలే మీ పెట్టుబడి.. కళ్ళు చెదిరే ఆదాయం..ఈ ఐడియా మీ కోసమే..

-

మీరు బాగా మాట్లాడుతూ ఉంటారా?ఎవరినైనా మాటల తో బుట్టలో వేసుకుంటున్నారా? అయితే మీకో బిజినెస్ ఐడియా ఉంది.. ఈ రోజుల్లో డబ్బులు, మాటలు ఉంటే ఎటువంటి పని అయిన సులువుగా జరిగిపోతుంది..ఆ మాటలనే బిజినెస్ ను పెంచుకోవడం కోసం ఉపయోగిస్తున్నారు. ఆ బిజినెస్ ఏంటంటే..ఒకప్పుడు మధ్యవర్తులు నిర్వహిస్తున్న విధులను నేడు మ్యారేజ్ బ్యూరోలను నిర్వహిస్తున్నాయి. అయితే.. ఇది కేవలం పెళ్లిళ్లు కుదిరించడం మాత్రమే కాదు..ఇది కూడా ఓ వ్యాపారం అనే విషయాన్ని గుర్తించుకోవాలి.

ఈ వ్యాపారంలో మంచి ఆదాయాన్ని సంపాధించవచ్చు. మ్యారేజ్ బ్యూరో అంటే ఆధునిక మధ్యవర్తులు అని అర్థం.. ఈ బ్యూరోలు రెండు పార్టీలకు అబ్బాయి లేదా అమ్మాయికి సంబంధించిన మొత్తం డేటాను అందిస్తాయి. వివాహం నిశ్చయమైన తర్వాత.. వారు రెండు పార్టీల నుంచి కమిషన్ తీసుకుంటారు..మ్యారేజ్ బ్యూరోని ప్రారంభించడానికి ఒక గది, హాల్ అవసరం అవుతుంది.

గది కనీసం 4-6 మంది సులభంగా కూర్చోగలిగేంత పెద్దదిగా ఉండాలి. మీరు కుదిర్చే సంబంధాల ఆధారంగా మీకు మౌత్ పబ్లిసిటీ లభిస్తుంది. మ్యారేజ్ బ్యూరోని ప్రారంభించాలనునే వారికి మంచి సంభాషణ నైపుణ్యం ఉండాలి. ఇరు వర్గాలను మెప్పించే సామర్థ్యం ఉండాలి. వంద అబద్ధాలు ఆడి అయినా ఓ పెళ్లి చేయాలన్నది సామెత.. అంటే చిన్న చిన్న సమస్యలు వచ్చిన నచ్చ చెప్పేలా ఉండాలి..

మొదట కొంత ఖర్చులు ఉంటాయి.. రూ.50,000-1,00,000 లక్షల ప్రారంభ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఆదాయం గురించి మాట్లాడితే.. మీరు బ్యూరో యొక్క రిజిస్ట్రేషన్ ఫీజును ఉంచవచ్చు. ఇది రూ. 500 నుండి రూ. 2500 వరకు ఉంటుంది. దీని తరువాత, వివాహం ఫిక్స్ అయినప్పుడు, రెండు పార్టీల నుంచి కమిషన్ మీకు లభిస్తుంది. ఈ కమిషన్ రూ.5 వేల నుంచి 50,000 రూపాయల వరకు ఉంటుంది..ఆఫీస్ మొదలు పెట్టాము అని వదిలేయ్యకూడదు..మన ప్రకటనలు మనమే ఇచ్చుకోవాలి..సోషల్ మీడియాలో ప్రచారం చెయ్యాలి..అలా చేస్తె పదిమంది వస్తారు..బిజినెస్ పెరుగుతూంది.

Read more RELATED
Recommended to you

Latest news