బిజినెస్ ఐడియా: వీటితో విద్యార్ధులకి అదిరే లాభం..!

-

చాలా మంది విద్యార్థులు చదువుకుంటూ డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. అటువంటి వాళ్ళ కోసం కొన్ని బిజినెస్ ఐడియాస్. ఈ ఐడియాస్ ని అనుసరించడం వల్ల మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టక్కర్లేదు అదే విధంగా నష్టం అనేది ఉండదు.

కేవలం రాబడి మాత్రమే వస్తుంది. అయితే అదిరిపోయే రాబడి వచ్చే బిజినెస్ ఐడియాస్ గురించి ఇప్పుడే చూసేయండి.

చాలా మంది విద్యార్థులు హై స్కూల్లో చదువుకుంటూ లేదా యూనివర్సిటీలో, కళాశాలలో చదువుకుంటూ పాకెట్ మనీ కింద డబ్బులు పొందాలి అని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ ఐడియాస్ ని కనుక అనుసరించారు అంటే తప్పకుండా మంచి రాబడి వస్తుంది. ఇక బిజినెస్ ఐడియాస్ గురించి చూస్తే..

ట్యూటర్:

చాలా మంది ఇప్పుడు ట్యూటర్స్ ని పెట్టుకుంటున్నారు. మీరు ఆన్ లైన్ లో ట్యూటర్ కింద వర్క్ చెయ్యచ్చు. ఇతర విద్యార్థులకు మీరు ట్యూషన్స్ చెప్పడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. మీకు కనుక ఏమైనా సబ్జెక్ లో మంచి పట్టు ఉంటే అప్పుడు మీరు విద్యార్థులకి నేర్పవచ్చు. ఇలా చేయడం వల్ల మంచిగా డబ్బులు వస్తాయి.

పాత పుస్తకాలని అమ్మడం:

చాలా మంది అయిపోయిన తరగతి పుస్తకాలని ఎవరికైనా ఇచ్చేయడం లేదా డస్ట్ బిన్ లో పడేయడం లాంటివి చేస్తూ ఉంటారు.

అయితే మీరు అలా కాకుండా ఈ పుస్తకాలని సెకండ్ హ్యాండ్ షాపుల్లో కానీ మీ జూనియర్స్ కి కానీ అమ్మితే.. మీకు డబ్బులు వస్తాయి. పైగా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా దీనిలో పెట్టక్కర్లేదు.

ఫోటోగ్రఫీ:

మీకు కనుక ఫోటోగ్రఫీ ఇష్టం అయి ఉంటే తప్పకుండా మీరు ఫోటోగ్రఫీ తో డబ్బులు సంపాదించవచ్చు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఫోటోగ్రఫీ కి మంచి డిమాండ్ ఉంది.

కనుక మీరు అద్భుతమైన ఫోటోలను తీసి మంచి ప్రాఫిట్ పొందొచ్చు. ఇలా ఫోటోగ్రఫీ సర్వీసుల ద్వారా మీరు పాకెట్ మనీ సంపాదించుకోవడానికి వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news