మీకు ఉద్యోగం అంటే ఇష్టం లేదా…? ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా ని కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మంచి రాబడి పొందొచ్చు. అదే నూడిల్స్ బిజినెస్. ఇక ఈ బిజినెస్ కి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… మార్కెట్లో నూడిల్స్ కి మంచి డిమాండ్ వుంది.
పైగా రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. నూడిల్స్ మేకింగ్ బిజినెస్ కి ఎక్కువ ఖర్చు అవ్వదు. ఖర్చు కంటే రాబడి రెండు రేట్లు ఎక్కువ వస్తుంది. చాలా కంపెనీలు ఈ వ్యాపారం చేస్తున్నాయి. కంపెనీలకి లక్షల్లో లాభాలు వస్తున్నాయి. అయితే ఈ నూడుల్స్ తయారు చేయడానికి గోధుమ ధాన్యం రవ్వ, నూడిల్స్ మేకింగ్ మిషన్ కావాలి.
ఈ రెండు ఉంటే సులభంగా మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు. గోధుమ రవ్వ ని తీసుకుని అందులో నీళ్ళు పోసి తయారు చేసుకోవాలి. మిషన్ వేసి.. ఆ తర్వాత నూడుల్స్ ని తయారు చేయడం మొదలుపెట్టాలి. మార్కెట్ లో సులభంగా గోధుమరవ్వ దొరుకుతుంది.
నూడిల్స్ మిషన్ వచ్చేసి ఆన్లైన్లో మీరు కొనుగోలు చేయవచ్చు. లేదంటే పట్టణాల్లో దొరుకుతుంది. అయితే ఈ మిషన్ 30 వేల రూపాయల నుంచి 50 వేల వరకు ఉంటుంది. రవ్వ అయితే కిలో రూ. 20 నుంచి 30 వరకు ఉంటుంది. అలానే మీకు ప్యాకింగ్ మిషన్ కూడా అవసరమవుతుంది. ఇలా వీటితో మీరు ఈజీగా వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు. పైగా ఎంత ఖర్చు పెడితే దాని కంటే రెండు రెట్లు లాభాలు మీరు పొందొచ్చు. మీరు కనుక సుమారు 50 వేల రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు రెండు లక్షల ఆదాయం వస్తుంది.