హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ : ఉదయం 4 నుంచే అందుబాటులోకి సిటీ బస్సులు

-

హైదరాబాద్ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు ఉదయం 6 గంటల నుంచే అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ప్రయాణికులకు ఆర్టీసీ కూడా గుడ్ న్యూస్ చెప్పింది. ఇందుకు సంబంధించి ఆర్టీసీ అధికారులకు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెల్లవారు జాము 4 గంట‌ల నుంచే ఆర్టీసీ బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  సికింద్రాబాద్‌, నాంప‌ల్లి, కాచిగూడ రైల్వే స్టేష‌న్ల‌తో పాటుగా, ఎంజీబీఎస్‌, జేబీఎస్ లలో కూడా తెల్ల‌వారుజామున 4 గంట‌ల నుంచే సిటీ బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ది.

తెల్లవారుజామును తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు, రైళ్లలో వచ్చే ప్రయాణికులకు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. తెలవారు జామును 3-4 గంటలకు వచ్చే ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరకునేందుకు ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసులనో.. ఆటోలనో ఆశ్రయిస్తున్నారు. దీని వల్ల ప్రయాణికలపై భారం పడుతోంది. నగర వాసుల్లో కొంత మంది తమ విధులకు వేకువజామున్నే వెళ్లాల్సి ఉంటోంది. ప్రస్తుతం ఆర్టీసీ నిర్ణయం వల్ల ప్రయాణికులకు మరింతగా సిటీ బస్సు సేవలు అందుబాటులోకి రానున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news