నిరుద్యోగి కేంద్రంగా తెలంగాణ రాజకీయం.. పైచేయి ఎవరిదో?

-

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు నిరుద్యోగి, నోటిఫికేషన్స్ చుట్టూ తిరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో 50వేలకు పైగా కొత్తగా జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామని అధికార పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత నాగార్జున సాగర్, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కానీ, జాబ్ నోటిఫికేషన్స్ మాత్రం రాలేదు. నిరుత్సాహంలో ఉన్న కొంత మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల దృష్టి కూడా నిరుద్యోగి, నోటిఫికేషన్స్ చుట్టూ కేంద్రీకృతమయ్యాయి. ఏదో ఒక రూపంలో ఉద్యమ కార్యాచరణను మొదలు పెట్టాయి.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. కొట్లాడి సాధించున్న స్వరాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. 2016 తర్వాత మళ్లీ గ్రూప్-2 నోటిఫికేషన్ ఊసేలేదు. గత నాలుగేండ్లు అసలు నోటిఫికేషన్ల ఆచూకే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 50వేల ఉద్యోగాలకు కొత్తగా నోటిఫికేన్స్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తున్న నిరుద్యోగ యువత నమ్మని పరిస్థితి ఉంది. కొంత మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుండటంతో అన్ని పార్టీల దృష్టి నోటిఫికేన్లపై పడిండి.

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నిరుద్యోగ సమస్య తమ ప్రధాన ఎజెండాగా ప్రకటించారు. ఇప్పటికే నిరుద్యోగ జంగ్ సైరన్ పేరిట ఉద్యమం సాగిస్తున్నారు. జిల్లాల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున దిల్‌‌‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగ జంగ్ సైరన్ నిర్వహించారు. ఆ తర్వాత వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ర్యాలీలు చేపట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం తర్వాత ఊపు మీదున్న బీజేపీ కూడా నిరుద్యోగ సమస్యను నెత్తిన ఎత్తుకున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులతో ముచ్చటించారు. ఆ తర్వాత నిరుద్యోగ మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. ఈ నెల 16న ట్యాంక్ బండ్ మీదుగా నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలిందేనని డిమాండ్ చేశారు.

ఉద్యోగ నోటిఫికేషన్లపై తొలి నుంచీ గళం విపుతున్న వారిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ ముందు వరుసలో ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రస్తుత ప్రజా ప్రస్థాన యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అయినా, ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్షలు చేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌పై పదునైన విమర్శలు చేస్తున్నారు.

బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సోషల్ మీడియా వేదికగా నిరుద్యోగులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగం వదిలి వచ్చింది మీకు ఉద్యోగ కల్పన కల్పించడం కోసమేనని భరోసా ఇస్తున్నారు. పదునైన వ్యాఖ్యలతో అధికార పార్టీ విమర్శలు చేస్తున్నారు.

అధికార టీఆర్‌ఎస్ పార్టీ సైతం మళ్లీ జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామని తెలుపుతున్నది. హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రెస్‌మీట్లలో సైతం ఇదే విషయం చెప్పారు. అతి త్వరలో 60 నుంచి 70వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని మరోసారి చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news