బిజినెస్ ఐడియా: అటుకులతో నెలకి లక్షకి పైగా ఆదాయం..!

-

అటుకుల బిజినెస్ చేస్తే మంచిగా లాభాలు వస్తాయి. చాలా మంది అటుకులతో వివిధ రకాల రెసిపీస్ తయారు చేసుకుంటూ ఉంటారు. తరచూ ఇంట్లో ఎక్కువగా వాడుతుంటారు. డిమాండ్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్ ని పెడితే మంచిది. పైగా ఇలాంటి వ్యాపారాలని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ప్రోత్సహిస్తుంది.

దీని కోసం మీరు అటుకులు మిల్ సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని సెట్ చేసుకోవడానికి మీకు రెండున్నర లక్షలు ఖర్చు అవుతాయి. ప్రభుత్వం ఆర్థిక సాయం కింద 90% వరకు కూడా దీనికి లోన్ ఇస్తుంది. కనుక మీ చేతిలో అంత డబ్బు లేకపోతే రూ.25,000 ఉంటే సరిపోతుంది. ఇక ఈ వ్యాపారానికి ఏమి కావాలి అనేది చూస్తే.. మీరు మిల్లు పెట్టాలంటే 500 చదరపు అడుగుల స్థలం అవసరం. అలానే యూనిట్ కోసం లక్ష రూపాయలు అవుతాయి.

అలానే మరికొంత డబ్బులు కూడా పడతాయి. మీరు ఈజీగా లోన్ తీసుకుని మిల్ ని సెట్ చేసుకోవచ్చు. అటుకులు తయారీ కోసం కొన్ని రా మెటీరియల్స్ అవసరమవుతాయి. మీరు వెయ్యి క్వింటాళ్ల అటుకుల్ని అమ్మితే పది లక్షల వరకు ఆదాయం వస్తుంది.

లోన్, మొత్తం ఖర్చులన్నీ ఎనిమిది లక్షల పోగా మీకు లక్షన్నరకు పైగా మిగులుతుంది. ఇలా మీరు ఈ వ్యాపారం తో మంచిగా రాబడి పొందొచ్చు. షాపులకి, సూపర్ మర్కెట్స్ కి సప్ప్లై చేసి మీ బిజినెస్ ని మరెంత బాగా అభివృద్ధి చేసుకుని చక్కటి రాబడిని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news