మంచి స్థలం ఉండి కూడా పంటలు పెట్టాడానికి కుదరడం లేదు..అనుకునేవారికి చక్కటి గుడ్ న్యూస్..వెదురు చెట్లను నాటితే 70 ఏళ్ల వరకు లాభాలే..లాభాలు..ప్రకృతి వనరుగా, పేదవాడి కలపగా దీన్ని పిలుస్తారు.. పచ్చబంగారంగా పిలుచుకునే సిరుల పంట. ఇతర మొక్కలతో పోలిస్తే 35 శాతం అధికంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలిగే సత్తా దీని సొంతం. ప్రస్తుతం అటవీ ప్రాంతానికే పరిమితమైన వెదురు పంటను మైదాన ప్రాంతాల్లోనూ సాగు చేయించే లక్ష్యంతో ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తూ, వారికి సబ్సిడీ కూడా ఇస్తుంది.
ఒకసారి నాటితే 70 ఏళ్లపాటు నిరంతరాయంగా దిగుబడి లభిస్తుంది. 50 నుంచి 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. రకాలను బట్టి నాటిన మూడు, నాలుగేళ్ల నుంచి ఏటా 25-30 టన్నుల వరకు దిగుబడి ఇస్తుంది. తొలి ఏడాది ఎకరాకు రూ.60 వేల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది.ఆ తర్వాత ఏటా ఎకరాకు రూ.10 వేల ఖర్చు చేస్తే చాలు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఆదాయం వస్తుంది. వెదురులో 140కు పైగా రకాలున్నప్పటికీ మన ప్రాంతానికి అనువైనవి, మార్కెట్లో డిమాండ్ ఉన్నవి 14 రకాలే. వెదురు సాగును ప్రోత్సహిస్తే భూమి సారవంతమవుతుంది. సాగులో ఎలాంటి రసాయనాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు.
లంక, బీడు భూములతో పాటు పొలం గట్లు, పండ్ల తోటల చుట్టూ కంచె రూపంలో సాగు చేస్తే పంటలకు రక్షణతో పాటు లాభాలను కూడా పొందవచ్చు..వెదురు మొక్కలను నాటిన తర్వాత ఒక్కో మొక్కకు మూడేళ్లపాటు రూ.240 వరకు ఖర్చవుతుంది. ప్రైవేటు భూముల్లో సాగు చేసే వారికి 50 శాతం, ప్రభుత్వ భూముల్లో నాటితే 100 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. సబ్సిడీ మొత్తంలో తొలి ఏడాది 50 శాతం, రెండో ఏడాది 30 శాతం, మూడో ఏడాది 20 శాతం చొప్పున అందిస్తారు. పంట పొలాలు, పండ్ల తోటలు, ఆక్వా చెరువుల చుట్టూ కంచె రూపంలో వెదురు మొక్కలు వేసినా పరిగణనలోకి తీసుకుని నిర్దేశించిన సబ్సిడీని అందిస్తారు.
రూ.7.5 లక్షలతో చిన్న నర్సరీలు, రూ.15 లక్షలతో పెద్ద నర్సరీలు ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి 40 శాతం సబ్సిడీ అందిస్తారు. ఇక ప్రాసెసింగ్ యూనిట్లకు 50 శాతం సబ్సిడీ ఇస్తారు. ఫర్నిచర్, వెదురు ఉప ఉత్పత్తులను అమ్ముకునే వారికి సైతం 50 శాతం సబ్సిడీతో చేయూత ఇస్తారు..ఈ పంటను ఒకసారి వేస్తే ఆ మొక్కలు పెరుగుతూ వస్తాయి..దాంతో ఆదాయం ఉంటుంది.. పొలం సారం పెరుగుతుంది..మీకు ఇలాంటి ఆలోచన ఉంటే మీరు కూడా మొదలు పెట్టండి..