అభిరుచితో ఆదాయం… వాటే బిజినెస్ ఐడియా…!

-

ఆసక్తి ఉంటే ఏమైనా చేయచ్చు అని నిరూపించారు. సాధారణంగా మనం డబ్బు సంపాదించాలంటే చాలా కష్ట పడాలి. ఆసక్తి ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా మనం భావించి డబ్బులు సంపాదించవచ్చు. అనుకున్నది చేయాలంటే దానికి తగ్గ కృషి, కష్టం తప్పక ఉండాలి. వ్రిట్టి 25, నరుల 20 స్ట్రాబెర్రీస్ ని పెంచుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ల తండ్రి స్ట్రాబెర్రీస్ ని పెంచే వారని, చండీగర్ లో వాళ్ళకున్న కొద్దిగా పొలంలో అయిన స్ట్రాబెర్రీస్ ని పండించే వారు అని చెప్పారు.

అయితే  మొదట అర ఎకరం పొలం లో స్ట్రాబెర్రీస్ ని పండించి వాట్సాప్ ద్వారా అమ్మేవారట. ఇప్పుడు నెమ్మదిగా నాలుగు ఎకరాల పొలం లో పండిస్తున్నారు. వీటిని అమ్మడానికి ఇంస్టాగ్రామ్ ఎకౌంట్ ఓపెన్ చేశారని వాళ్ళు చెబుతున్నారు. ఈ రోజు ఏకంగా 80 డెలివరీలు ఇస్తున్నట్లు తెలియజేశారు.

మొదట రెండు రకాలలో పండించేవారు. ఇప్పుడు ఏకంగా ఆరు రకాలలో పండిస్తున్నారని వాళ్ళు చెబుతున్నారు. కాలిఫోర్నియా, హిమాచల్ ప్రదేశ్ ప్రదేశాల నుంచి మొక్కలు తీసుకు వచ్చినట్లు వాళ్ళు చెబుతున్నారు. పైగా ఇది పూర్తిగా ఆర్గానిక్ మరియు ఎటువంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ వాడడం ఉండదు అని చెప్తున్నారు. 11 మంది పని వాళ్ళని నియమించి పండ్లని కోయడం, పళ్లని పెంచడంలో వాళ్లు సహాయం చేస్తారని వాళ్ళు చెప్తున్నారు.

అలానే సిటీ లో సప్లై చేయడానికి ముగ్గురు రైడర్స్ ని కూడా నియమించారు. సూపర్ మార్కెట్ మొదలైన షాపుల తో కూడా డీల్ కుదుర్చుకుని పండ్లను సప్లై చేస్తున్నట్లు చెప్తున్నారు. అలానే కాన్పూర్ మరియు బెంగళూరు నుంచి కూడా చాల మంది కొనుగోలు చేస్తున్నట్లు చెప్తున్నారు. కేజీ స్ట్రాబెరీ ధర రూపాయలు 200 స్ట్రాబెర్రీ పండ్లు సైజును బట్టి రేటు ఉంటుంది.

పెద్ద పెద్ద పండ్లు అయితే కేజీ రూపాయలు నాలుగు వందలు. నిజంగా రోజుకి ఒక 10 కేజీలు స్ట్రాబెర్రీ పండ్లు అమ్మితే దాదాపు 1000 నుంచి 1500 వరకు వస్తాయి. నెమ్మదిగా కస్టమర్లతో డీల్స్ కుదుర్చుకుంటే వ్యాపారం మరింత విస్తరించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటే బిజినెస్ ఐడియా కదా…! ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు దీనిని ఉదాహరణగా తీసుకుని సొంతంగా ఇలా వ్యాపారం చేసుకోవచ్చు. దీని వల్ల మీకు మంచి రాబడి వస్తుంది. పైగా మీ ఆలోచనలు, మీ ప్లాన్ ఇలా వినూత్నంగా ఆలోచించి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news