బిజినెస్ ఐడియా: తక్కువ పెట్టుబడి తో స్ట్రాబెర్రీ పంట..నెలకు లక్షలు ఆదాయం..

కొన్ని పంటలు ఆదాయాన్ని ఇస్తాయి..మరి కొన్ని పంటలు వ్యయాన్ని ఇస్తాయి.ఆదాయాన్ని ఇచ్చే పంటల విషయానికొస్తే స్ట్రాబెర్రీ పంట మంచి ఆదాయం..తక్కువ పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయం వస్తుంది..ఈ రైతు తాను ఎంతో కాలంగా పండిస్తున్న గోధుమ పంటకు బదులు స్ట్రాబెర్రీని సాగు చేశాడు.నెలకు లక్షల ఆదాయాన్ని పొంది ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలిచాడు.అతని గురించి వివరంగా తెలుసుకుందాము..

 

జమ్మూ కశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలోని కూహ్ గ్రామానికి చెందిన రష్ పాల్ సింగ్… సాంప్రదాయ పంట అయిన గోధుమలను కాదని… సేంద్రీయ పద్ధతిలో స్ట్రాబెర్రీలను పండిస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు.కూహ్ గ్రామంలో చాలా మంది రైులు సాంప్రదాయ పంటలైన గోధుమలు, మొక్కజొన్న పంటలను పండిస్తారు.అందరిలాగే రష్ పాల్ సింగ్ కూడా గోధుమలు పండించే వాడు. కాయకష్టం చేసినా… ఆదాయం మాత్రం అంతంతమాత్రంగానే ఉండేది. రైతులను వివిధ రకాల పంటల వైపు మళ్లించడానికి అక్కడి ప్రభుత్వం రాయితీలు కూడా ఇస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న సాయంతో రష్ పాల్… స్ట్రాబెర్రీ పంట వైపు మళ్లాడు. పంట వేయాలని అయితే నిర్ణయించుకున్నాడు కానీ లాభాలు వస్తాయో లేదో అనే అనుమానం మాత్రం ఉండేది. కానీ ముందుకే వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు రష్ పాల్. అధునాతన పద్ధతులు ఉపయోగించి స్ట్రాబెర్రీ సాగు చేయడంతో, అతనికి దిగుబడి ఆశించిన దానికన్నా ఎక్కువ వచ్చింది.

పన్నెట లలో ప్రైవేటు డీలర్లు నుండి రూ.35-40 చొప్పున నేరుగా ప్రయాణికులకు అలాగే పర్యాటకులకు అమ్మడం మొదలు పెట్టారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మరియు జిల్లా హెడ్‌క్వార్టర్స్‌ను కలిపే ఇతర లింక్ రోడ్‌ల పక్కన దుకాణాన్ని ఏర్పాటు చేశారు.10 మార్ల భూమిలో పండించిన పంట నుండి సుమారు రూ. 40 వేలు సంపాదించినట్లు చెప్పారు రష్ పాల్. తన స్ట్రాబెర్రీ పంట విజయవంతమైందని తెలిపాడు. క్రమంగా తన పంట విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించుకున్నాడు. తన కొడుకు తను వేరే పని లేకుండా ఇదే పనిలో ఉన్నారు. ఇప్పుడు అతనికి లక్షలు లాభం వస్తుంది.తోటి రైతులకు మార్గంగా నిలవడంతో పాటుగా వారికి పంటలో మెలుకువలు కూడా చెబుతున్నారు.