వాటే స్కీమ్.. రూ.400 పొదుపుతో రూ.40 లక్షలు పొందండి..!

చాలా మంది వాళ్ళ దగ్గర వుండే డబ్బుల్ని నచ్చిన స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటూ వుంటారు. అయితే ఇలా ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఆప్షన్స్ వుంటుంటాయి. అయితే ఏది మంచిది అనేది చూసుకుని డబ్బు పెడితే మంచిది. మంచి స్కీమ్స్ లో డబ్బులు పెడితే రిస్క్ ఉండదు అలానే మంచిగా రాబడి కూడా వస్తుంది.

కాబట్టి ఏ స్కీమ్ బెస్ట్ ఓ తెలుసుకుని అప్పుడే డబ్బుల్ని పెట్టండి. పోస్టాఫీస్‌లో పలు రకాల పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో డబ్బులు పెడితే మంచి రాబడి పొందొచ్చు. అదే విధంగా డబ్బు పెట్టడం వలన రిస్క్ ఉండదు. పోస్టాఫీస్ అందిస్తున్న స్కీమ్స్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం కూడా ఒకటి.

ఇక దీని గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల ఎలాంటి రిస్క్ లేకుండా మెచ్యూరిటీ సమయంలో అదిరే రాబడి వస్తుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు ఉంటుంది. ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ రేటు మారుతూ ఉండొచ్చు.

మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను కేంద్రం మారుస్తూ ఉంటుంది. ఇక ఎంత డబ్బులు ఇందులో పెట్టచ్చు అనేది చూస్తే.. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చెయ్యచ్చు. అంటే నెలకు రూ.12,500 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే రోజుకు దాదాపు రూ.410 వరకు పొదుపు చెయ్యచ్చు. లేదు అంటే ఏడాదిలో రూ.500 ఇన్వెస్ట్ చేసినా అకౌంట్ కొనసాగుతుంది.

రోజుకు రూ.400 పొదుపు చేసి నెల చివరిలో ఆ మొత్తాన్ని ఒకేసారి పీపీఎఫ్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేసారంటే.. అప్పుడు మెచ్యూరిటీ తర్వాత మీ చేతికి రూ.40 లక్షలకు పైగా వస్తాయి. రాబడి రూ.18.18 లక్షలు. ఇలా మొత్తం రూ.40.68 లక్షలు వస్తాయి.