ఓటీటీలోకి వైల్డ్‌డాగ్‌.. అదే బాట‌లో సుల్తాన్‌!

ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి సినిమా ఇండ‌స్ట్రీని కుదిపేస్తోంది. ఇప్ప‌టికే ప‌లు సినిమాలు వాయిదా ప‌డ్డాయి. మ‌రికొన్ని షూటింగ్ ఆపేశాయి. ఇక థియేట‌ర్ల‌లో రిలీజైన సినిమాలు కూడా ప్రేక్ష‌కులు రాక వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక‌పోయాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్ సినిమా వ‌కీల్ సాబ్ కు కూడా క‌లెక్ష‌న్లు క‌ష్ట‌మ‌య్యాయంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం సినిమా థియేటర్ల బంద్ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో చాలా రోజుల తరువాత ఓటీటీలోకి రావాల్సిన సినిమాలు ముందుగానే వ‌స్తున్నాయి. కింగ్ నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ ప‌ర్వాలేద‌ని పించింది. ముందునుంచే భారీ అంచ‌నాల న‌డుమ వ‌చ్చిన ఈ సినిమా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో ఓటీటీలోకి విడుద‌ల చేయాల‌ని మూవీ టీం భావించింది. అయితే అనుకున్న టైమ్ కంటే ముందే వ‌స్తోంది ఈసినిమా.

నాగ్‌ చాలా గ్యాప్ తీసుకొని చేసిన మూవీ వైల్డ్ డాగ్. మన్మథుడు 2తో భారీ డిజాస్టర్ అందుకున్న అక్కినేని హీరో చాలా కథలపై చర్చలు జరిపి చివ‌రికి వైల్డ్ డాగ్ లో న‌టించాడు. ఆశిషోర్ సోలమన్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో ఆడ‌లేదు. ముందు ఈ సినిమాను డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు.క్రాక్, ఉప్పెన లాంటి సినిమాలు హిట్టవ్వడంతో థియేట‌ర్ల‌లో విడుద‌ల చేశారు. కానీ ప్లాప్ అయింది. దీంతో ఈ గురువారం నుంచే సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడ‌ద‌ల చేస్తున్నారు. అలాగే కార్తి మూవీ సుల్తాన్ కూడా ఓటీటీలోనే విడుద‌ల అవుతోంది.