కరోనా విలయతాండవం… 3 .32 లక్షల కేసులు నమోదు…!

-

కరోనా వైరస్ తీవ్రత ఎక్కువై పోతోంది. రోజుకి లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో చూసుకుంటే 332 ,730 కేసులు నమోదయ్యాయి. దీంతో భారత దేశం లో ఇప్పటి వరకు 16,263,695 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,263 మంది కరోనా వైరస్ తో మరణించారు. రోజు రోజుకి చూస్తుంటే కరోనా తీవ్రత మరెంత ఎక్కువ అవుతోంది అని చెప్పవచ్చు.

గత కొన్ని వారాల నుంచి చూస్తుంటే కరోనా మహమ్మారి ఎందరో మందిని బలి తీసుకుంటోంది. కేవలం నిన్న ఒక్క రోజులోనే 314,835 కొత్త కేసులు నమోదయ్యాయి. అది కూడా 24 గంటల్లో అంటే ఎంత ఘోరమో..! ఇది ఇలా ఉంటే 1,740,550 సాంపిల్స్ ని టెస్ట్ చేసారు.

మొట్టమొదటిసారి భారతదేశం లో మూడు లక్షల పైగా కరోనా కేసులు వచ్చాయి. ఆసుపత్రి లో ఆక్సిజన్ సప్లై లో కొరత ఏర్పడింది. ఢిల్లీలో ఒక రోజు లో 300 మంది మరణించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ మరియు గుజరాత్ లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదయ్యే దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉంది. కాగా యూఎస్ లో అన్ని దేశాల కంటే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news