ఫైటర్ నుంచి” షేర్ కుల్ గయా” సాంగ్ విడుదల

-

డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ మరియు సొట్ట బుగ్గల సుందరి దీపిక పదుకొనే లు కలిసి నటిస్తున్న సినిమా ఫైటర్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఈరోజు షేర్ కూల్ గయా సాంగ్ ని చిత్ర బృందం విడుదల చేశారు. ఈ సాంగ్ లో హృతిక్ రోషన్ మరియు దీపిక పదుకొనే యొక్క డ్యాన్స్ స్టెప్పులు ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాయి.

భారీ అంచనాలతో ఈ సినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్ కానుకగా జనవరి 25న రిలీజ్ కాబోతుంది. వయాకం 18 స్టూడియోస్,మార్ పిక్స్ పిక్చర్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి విశాల్ శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అనిల్ కపూర్ ,అక్షయ్ ఒబెరాయ్,సంజీదా షేక్ కీలకపాత్ర లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది .హృతిక్ రోషన్ మరియు డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ కాంబినేషనల్లో బ్యాంగ్ బ్యాంగ్ , వార్ సినిమాలు వచ్చి ఎంతటి విజయాన్ని నమోదు చేశాయో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలను మించి భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news