రాజకీయాల్లోకి రానా.. 2019 ఎన్నికలే టార్గెట్..!

Is Rana Come into politics

అసలే తెలుగు రెండు రాష్ట్ర రాజకీయాలు ఉడికిపోతున్న ఈ తరుణంలో దగ్గుబాటి రానా మరోసారి రాష్ట్ర రాజకీయల మీద తన బాంబ్ వేసేందుకు సిద్ధం కానున్నాడట. రానా ఏంటి రాజకీయాలకు సంబంధం ఏంటని అనుకోవచ్చు. మనోడు మొదటి సినిమా లీడర్ గుర్తుంది కదా.. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా పర్ఫెక్ట్ డెబ్యూ మూవీ అయ్యింది.

ఆ సినిమా తర్వాత కొన్నాళ్లుగా లీడర్ సీక్వల్ ప్రయత్నాలు జరుగుతున్నాయ్ అన్న వార్తలే తప్ప ముందుకు కదలలేదు. ఫైనల్ గా 2019 ఎన్నికల టార్గెట్ తో శేఖర్ కమ్ముల లీడర్ 2 స్క్రిప్ట్ రెడీ చేశాడట. రానాకు కూడా వన్ లైన్ ఆర్డర్ చెప్పినట్టు తెలుస్తుంది. లీడర్ సినిమా ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పు తెచ్చింది. సినిమా హీరో సిఎం అయితే ఎలా ఉంటుందో లీడర్ చూపించగా కొరటాల శివ మాత్రం మహేష్ ను కమర్షియల్ యాంగిల్ లో చూపించాడు.

హీరో సిఎంగా అప్పుడు లీడర్, ఇప్పుడు భరత్ అనే నేను రెండు హిట్ అయ్యాయి. ఈసారి ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి లీడర్-2 మీద పొలిటికల్ ఎరా కూడా ఉండబోతుందని చెప్పొచ్చు. మరి ఈ లీడర్-2 డీటైల్స్ ఏంటన్నవి మరి కొద్దిరోజుల్లో తెలుస్తుంది.