తూచ్.. పంది కడుపున మనిషి పుట్టలేదు. ఆ ఫొటోలు నకిలీవి..!

-

కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు గుర్తుంది కదా. పంది కడుపున మనిషి పుడతాడు అని. అవును, అదే..! అయితే అదే మాట నిజమైంది..! అంటూ ఈ మధ్య కాలంలో, గత వారం రోజులుగా ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది గమనించారు కదా. అలా అని చెప్పి ఆ వార్తతోపాటు మనకు పలు ఫొటోలు కూడా కనిపిస్తున్నాయి. వాటిని చూసి చాలా మంది నిజమే అని నమ్మి ఆ ఫొటోలను బాగా షేర్ చేయడం మొదలు పెట్టారు. అయితే.. నిజానికి ఆ ఫొటోల్లో ఉన్నది అసలైన జీవాలు కావు. అవి కళాఖండాలు. అవును, మీరు విన్నది నిజమే. ఓ విదేశీ కళాకారిణి వాటిని తీర్చిదిద్దింది.

మగానుకో లైరా అనే ఓ కళాకారిణికి సిలికాన్‌తో కళాఖండాలను చేయడం అలవాటు. అలా చేసే ఆకృతులను ఆమె తన వెబ్‌సైట్‌లో విక్రయిస్తుంటుంది. అందులో భాగంగానే చిత్రంలో ఉన్న బొమ్మలను ఆమె తీర్చిదిద్దింది. వాటినే ఫొటోలు తీసి తన వెబ్‌సైట్‌లో పెట్టింది. ఆ కళాఖండాల ఖరీదు మన కరెన్సీలో రూ.80 వేలు. అయితే కొందరు ఆ ఫొటోలను నిజమైనవిగా పేర్కొంటూ వైరల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో చాలా తక్కువ సమయంలోనే అవి వైరల్ అయ్యాయి.

The viral Baby-Cat that has shocked the world is none other than my sculpture. You can find it on my website or…

Posted by Baby and creatures by Maganuco laira on Sunday, April 15, 2018

ఆ ఫొటోలో ఉన్న పంది కడుపున మనిషి పుట్టాడు.. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం నిజమైంది.. అంటూ కొందరు ఆ ఫొటోలను ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో వైరల్ చేశారు. మరీ ముఖ్యంగా ఆ ఫొటోలు మన రెండు తెలుగు రాష్ర్టాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే చివరకు ఆమె ఆ విషయం తెలియడంతో ఆ ఫొటోలపై వివరణ ఇచ్చింది. కాబట్టి చూశారుగా.. సోషల్ మీడియా ఎంత పనిచేసిందో. అందులో వచ్చే ఇలాంటి నకిలీ వార్తలను నమ్మకండి. లేదంటే మోసపోవాల్సి వస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news