సైరా లీకుల గోల.. చిరంజీవి సీరియస్

-

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమా 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి లీక్స్ ఎక్కువయ్యాయని తెలుస్తుంది. ఇప్పటికే చిరంజీవి, అమితాబ్, నయనతార లుక్స్ లీక్ అయ్యాయి.

అదెలాగో కవర్ చేసుకున్నా ఇప్పుడు సినిమాలో విజయ్ సేతుపతి పిక్ లీక్ అయ్యింది. ఈ లీకుల పట్ల చిరంజీవి చాలా సీరియస్ అవుతున్నాడని తెలుస్తుంది. కోలీవుడ్ హీరోగా విజయ్ సేతుపతి విలక్షణమైన పాత్రలు చేస్తూ అలరిస్తున్నాడు. ఎలాంటి పాత్ర అయినా సరే చేస్తూ వస్తున్న విజయ్ సేతుపతి సైరాలో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

2019 ఆగష్టు 15న రిలీజ్ ప్లాన్ చేస్తున్న సైరా సినిమా అంచనాలను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ రివారి మ్యూజిక్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news