10 రోజుల్లో 101 కోట్ల షేర్.. మ‌హేష్ జోరు మామూలుగా లేదుగా..

-

సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్ `సరిలేరు నీకెవ్వరు`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌ల అయింది. సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వీకెండ్ ముగిసినా మహేష్ సరిలేరు నీకెవ్వరు వసూళ్ల జోరు తగ్గలేదు.

యాక్షన్ ను .. ఎమోషన్ ను టచ్ చేస్తూ వినోదభరితంగా సాగిన ఈ సినిమా, వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో ఈ సినిమా 101.97 కోట్ల షేర్ ను వసూలు చేసింది. చాలా ఏరియాలలో సరిలేరు నీకెవ్వరు బ్రేక్ ఈవెన్ దాటి లాభాలలోకి ప్రవేశించింది. ఇక ఒక్క నైజాంలోనే ఈ సినిమా 33 కోట్ల షేర్ ను సాధించి, మహేశ్ కెరియర్లో నైజామ్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా కొత్త రికార్డును నమోదు చేసింది.

ప్రాంతాల వారీగా 10 రోజులకు ఏపీ/తెలంగాణాలలో కలెక్షన్స్ వివరాలు:

నైజాం- రూ. 33.0 కోట్లు

సీడెడ్- రూ.14.65 కోట్లు

ఉత్తరాంధ్ర- రూ. 17.07 కోట్లు

గుంటూరు- రూ. 9.03 కోట్లు

ఈస్ట్- రూ. 10.06 కోట్లు

వెస్ట్- రూ. 6.57 కోట్లు

కృష్ణ- రూ. 7.97 కోట్లు

నెల్లూరు- రూ.3.62 కోట్లు
———————————————————
మొత్తం 10 రోజుల షేర్- రూ. 101.97 కోట్లు
———————————————————

Read more RELATED
Recommended to you

Latest news