ఖైదీ విడుదలకు 40 ఏళ్లు.. చిరు స్పెషల్ ట్వీట్

-

చిరంజీవిని ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత ఖైదీని చేసిన చిత్రం ‘ఖైదీ’. 1983, అక్టోబర్ 28న విడుదలైన ‘ఖైదీ’ ఓ ఫ్రభంజనమే సృష్టించింది. చిరు సినీ కెరీర్ ను మలుపుతిప్పిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో అనతి కాలంలోనే అతను మెగాస్టార్ గా ఎదగడానికి దోహదపడింది. ‘ఖైదీ’ సినిమా కంటే ముందే చిరంజీవికి హిట్స్, సూపర్ హిట్స్ ఉన్నాయి. అప్పటికే ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లైన చిరంజీవి.. 50 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇక హీరోగా ‘న్యాయం కావాలి, ఇంట్లో రామయ్య వీధిల్లో కృష్ణయ్య, శుభలేఖ, అభిలాష’ వంటి విజయాలున్నాయి. అయితే చిరంజీవికి మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరిచిన సినిమా ‘ఖైదీ’.

ఖైదీ సినిమా నిజంగానే అభిమానుల గుండెల్లో తనను శాశ్వత ఖైదీని చేసిందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ సినిమా నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్. ఖైదీ విడుదలై నేటికి 40 ఏళ్లు అయిన సందర్భంగా ఓసారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాను. అంత గొప్ప విజయాన్ని మాకు అందించిన తెలుగు సినీ ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు అని చిరంజీవి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news