96 దిల్ రాజుకి పెద్ద టాస్క్..!

-

విజయ్ సేతుపతి, త్రిష జంటగా ప్రేం కుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా 96. చిన్న సినిమాగా రిలీజై అఖండ విజయం సాధించిన ఈ మూవీని రిలీజ్ ముందే దిల్ రాజు రీమేక్ రైట్స్ కొనేశాడు. తెలుగులో సినిమా తీయడం పెద్ద సాహసమే అని చెబుతున్నా దిల్ రాజు మాత్రం పట్టువీడకుండా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. తెలుగులో ఈ సినిమాలో శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్నారు.

అయితే ఇక్కడ విశేషం ఏంటంటే 96 తమిళ మూవీలో హీరో హీరోయిన్ చిన్ననాటి పాత్రలకు మంచి స్కోప్ ఉంది. ఆ పాత్రలు కూడా ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే విజయ్, త్రిషల పాత్రలతో పాటుగా ఆదిత్యా భాస్కర్, గౌరీ కిషన్ లు నటించారు. అయితే తెలుగులో ఈ పాత్రలను ఎవరు చేస్తారన్నది పెద్ద టాస్క్ అందుకే దిల్ రాజు శర్వానంద్, సమంతల టీనేజ్ పాత్రల కోసం కాస్టింగ్ కాల్ పెట్టాడు. 14 నుండి 20 సంవత్సరాలు మధ్యలో ఉన్న వారు ఈ కాస్టింగ్ కాల్ లో పాల్గొనవచ్చు. శర్వానంద్, సమంతల పోలికలు ఉంటే మాత్రం లక్ అని చెప్పొచ్చు. మరి దిల్ రాజుకి ఇది పెద్ద టాస్కే కాగా 96 తెలుగు రీమేక్ ఏం చేస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news