భర్తను భార్య చంపితే అది మర్డర్ కాదు.. సుప్రీం సంచలన తీర్పు

-

It's not murder but culpable homicide if woman kills husband for calling her and daughter prostitutes

సుప్రీం కోర్టు ఇవాళ ఆసక్తికరమైన తీర్పును వెలువరించింది. తమిళనాడులోని ఓ కేసులో ఈ తీర్పును వెలువరించింది సుప్రీం కోర్టు. కూతురు ముందు భార్యను భర్త వ్యభిచారిణి అంటూ నిందిస్తే.. ఆ నిందను భరించలేని మహిళ.. తన భర్తను చంపితే అది మర్డర్ కాదంటూ సంచలనమైన తీర్పును వెలువరించింది. అది ఎట్టిపరిస్థితుల్లోనూ మర్డర్ కాదని.. అది ఓ నరహత్యగా భావించాలంటూ పేర్కొన్నది.

తమిళనాడుకు చెందిన ఓ మహిళ పెళ్లయిన తర్వాత వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకున్నది. ఈ విషయం తన భర్తకు తెలిసి.. తనను నిందించాడు. వ్యభిచారిణి అంటూ తిట్టాడు. వాళ్లిద్దరి మధ్య గొడవైంది. ఆ సమయంలో వాళ్ల కూతురు కూడా అక్కడే ఉన్నది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు. భర్త తిట్టడాన్ని భరించలేని ఆ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి కారులో కాల్చేసింది. ఆ విషయాన్ని కోర్టు ముందు కూడా ఒప్పుకున్నది. దీంతో మద్రాసు కోర్టు ఆమెకు, ప్రియుడికి జైలు శిక్ష వేసింది. అయితే.. ఆ తీర్పును సవాలు చేస్తూ వాళ్లు సుప్రీంను ఆశ్రయించారు.

ఆ కేసుపై వాదోపవాదాలు విన్న సుప్రీం ధర్మాసనం… ఆ మహిళపై నమోదయిన మర్డర్ కేసును కొట్టేసింది. దాన్ని కల్పబుల్ హోమిసైడ్ గా అభివర్ణించింది. వాళ్ల జైలు శిక్షను కూడా తగ్గించింది.

Read more RELATED
Recommended to you

Latest news