నేషనల్ ఫిల్మ్ డే స్పెషల్.. ఈరోజు రూ.99కే సినిమా టికెట్‌

-

నేడు జాతీయ సినిమా దినోత్సవం. ఈ రోజు సినిమా ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ఉంది. ఇవాళ ఒక్కరోజు మాత్రమే రూ.99లకే సినిమా టికెట్ పొందవచ్చంట. ఈ ప్రకటన నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అయితే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు, తమిళనాడు, కేరళలలో మాత్రం ఈ ఆఫర్‌ వర్తించదట. అయితే 110 సంవత్సరాల ఇండియన్ సినిమాను పురస్కరించుకుని.. తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో మాత్రం రూ.112కే టికెట్‌ లభించనుంది.

ఇక కేరళలోని పలు మల్టీప్లెక్స్‌లు రూ.129, మరికొన్ని చోట్ల రూ.99కే టికెట్లను విక్రయించనున్నారు. రెగ్యులర్‌ ఫార్మాట్‌, నాన్‌ రెక్లయినర్‌ సీట్స్‌కు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందట. ఇక సినిమాకు వెళ్లినప్పుడు పాప్ కార్న్, ఫుడ్, కూల్ డ్రింక్స్ తప్పనిసరి. అందుకే ఈ ధరలపై కూడా డిస్కౌంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. బెంగళూరుతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో మాత్రం రూ. 99 టికెట్ ఆఫర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఇవాళ టికెట్ బుక్ చేసుకుంటే ధర రూ. 99 అనే చూపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఇవాళ మీకు నచ్చిన సినిమాలను మీ ఫ్యామిలీతో చూసేయండి మరి.

Read more RELATED
Recommended to you

Latest news