69 ఏళ్ల వయస్సులో కొడుకు వీర్యంతో బిడ్డను కన్న తల్లి..!

-

సాధారణంగా ఈ ప్రపంచంలో తల్లి కొడుకుల బంధం వెలకట్టలేనిది. మాతృత్వాన్ని ఎన్ని కోట్లిచ్చినా పొందలేనిది. సోసైటిలో తల్లి కొడుకుల బంధానికి గౌరవం ఉంది. ఇకపోతే తాజాగా ఓ తల్లి తన కొడుకు వీర్యంతో బిడ్డను కనడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. స్పెయిన్ దేశానికి చెందిన ఒకప్పటి నటి అనా ఓబ్రెగాన్ వయస్సు ప్రస్తుతం 69 ఏళ్లు. ఈమెకు అలెస్ లెక్వియో అనే ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఆయన 27 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ బారిన పడి చనిపోయాడు. అనా కుమారుడు మరణానికి ముందే ఏదో ఒక రోజు తండ్రి కావాలన్న కోరిన ఉండేది. దీంతో ఆయన తన వీర్యాన్ని నిలువ చేసి ఉంచాడు.

వీర్యాన్ని ఓ సెంటర్ లో భద్రపరిచి ఉంచాడు. కానీ అలెస్ కోరిక తీరకముందుకే కొన్నాళ్లకే మరణించాడు. అయితే తండ్రి కావాలన్న ఆశతో అలెస్డ్ లెక్వియో తన వీర్యాన్ని భద్రపర్చిన విషయం ఇంట్లో లభించిన రసీదు ద్వారా తల్లి అనా ఓబ్రెగాన్కు తెలిసింది. దీంతో తండ్రి కావాలన్న తన కొడుకు కోరికను నెరవేర్చాలని అనా ఓబ్రెగాన్ నిర్ణయించుకుంది. అనుకున్నదే ఆలస్యం 2023లో సరోగసీ పద్ధతిలో కుమారుడి వీర్యంతో ఆమె 69 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. రీసెంట్గా ఈ విషయాన్ని బయటపెట్టడంతో నెటిజన్లు అనా ఓబ్రెగాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news